https://oktelugu.com/

KTR Vs Komatireddy Venkat Reddy: దమ్ముంటే రా.. తేల్చుకుందాం.. ఆవేశంలో అదుపు తప్పుతున్న కేటీఆర్‌ మాటలు..

తాజాగా సవాళ్లకు కూడా దిగారు. అగ్రెసివ్‌లో ఉన్న కేటీఆర్‌ ఇప్పటికే తన భాషతో ఇన్నాళ్లు తెలంగాణ ప్రజలకు ఆయనపై ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 3, 2023 11:37 am
    KTR

    KTR

    Follow us on

    KTR Vs Komatireddy Venkat Reddy: తన తండ్రి.. తెలంగాణ ముఖ్యమంత్రి జ్వరంతో బాధపడుతున్నాడని కేసీఆర్‌ను ఇంటికి పరిమితం చేసిన ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌.. ఇప్పుడు తెలంగాణలో పార్టీ గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నట్లు కనిపిస్తోంది. తన బావ, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తోడుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సభలతో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో మాట్లాడుతున్న కేటీఆర్‌ విపక్షాలపై ఆవేశంతో ఊగిపోతున్నారు. అధికారంలో ఉండి కూడా అదుపు తప్పి మాట్లాడుతున్నాడు. విపక్ష కాంగ్రెస్‌ బీజేపీలను తూలనాడుతున్నారు. ఏకంగా ప్రధానిని సైతం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీని అయితే ముసలి నక్క.. 60 ఏళ్లు ఏం పీకిండ్రు.. ఇప్పుడు ఏం పీకుతరు.. అంటూ తీవ్ర పదాలు, అసహ్యించుకునే భాష వాడుతున్నారు.

    సూర్యపేటలో సవాల్‌..
    ఇక తాజాగా సవాళ్లకు కూడా దిగారు. అగ్రెసివ్‌లో ఉన్న కేటీఆర్‌ ఇప్పటికే తన భాషతో ఇన్నాళ్లు తెలంగాణ ప్రజలకు ఆయనపై ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇక తాజాగా సూర్యాపేటలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బస్తీ మే సవాల్‌ విసిరి తాను అధికార పార్టీ మంత్రిని అనే విషయాన్ని మర్చిపోయారు. సాధారణంగా అధికారంలో ఉన్నవారిని విపక్ష నేతలు సవాల్‌ చేస్తారు. కోమటిరెడ్డి కొన్ని రోజులుగా 24 గంటల విద్యుత్‌ సరఫరాపై అదే చేస్తున్నారు. అధికార పక్షానికి నిద్రపట్టకుండా చేస్తున్నారు. 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్‌ చేస్తున్నారు. సూర్యపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డిని చిత్తుగా ఓడిస్తామని ప్రకటిస్తున్నారు.

    కేటీఆర్‌ కూడా విపక్ష నేతలా..
    మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమైన మంత్రికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. దీంతో ఎక్కడ సభ నిర్వహించినా కోమటిరెడ్డినే కేటీఆర్‌ టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. తాజాగా సోమవారం సూర్యపేటలో నిర్వహించిన సభలో అయితే తాను అధికార పార్టీ నేతను, రాష్ట్ర మంత్రిని అన్న విషయం కూడా మర్చిపోయారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు. సూర్యాపేటలో ఎవరికి డిపాజిట్‌ రాదో తేల్చుకుందాం.. దమ్ముంటే రా.. అంటూ ఛాలెంజ్‌ విసిరారు.

    ఆయన మాట్లాడితే సంసారం..
    ఇక కేసీఆర్‌ గురించి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతల గురించి విపక్ష నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్‌ బహిరంగ సభల్లో ఫైర్‌ అవుతున్నారు. అయితే ఎదుటి వారిని వేలెత్తి చూపితే నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయన్న విషయాన్ని కేటీఆర్‌ విస్మరిస్తున్నారు. తాను ప్రధాన మంత్రిని, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లపై ఇష్టానుసారం మాట్లాడితే తప్పు లేదట.. తన తండ్రి కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ నేతలను అంటే మాత్రం తప్పని కేటీఆర్‌ మాట్లాడడం చర్చనీయాంశమవుతోంది.