Krishna Gadu Ante Oka Range : ‘కృష్ణగాడు అంటే ఒకరేంజ్’ మూవీ రివ్యూ

డైరెక్టర్ కథను కొత్త కోణంలో చూపించాలనుకున్నా.. కాస్తా పాత స్టోరీని జోడించడంతో కొంచెం బోర్ కొడుతుంది. కానీ మొత్తంగా విభిన్నంగా తీయాలనే ఆలోచనతో సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు మ్యూజిక్ హైలెట్ గా చెప్పవచ్చు. పాటలుమాత్రమే కాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా తమ విలువలను చూపించారు.

Written By: NARESH, Updated On : August 4, 2023 9:41 am
Follow us on

Krishna Gadu Ante Oka Range : ‘బలగం’ నుంచి ‘బేబీ’ వరకు ఈ మధ్య చిన్న సినిమాలదే హవా సాగుతోంది. ఇలాంటి సినిమాల్లో ఆర్టిస్టుల కంటే కథకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే సినిమాను ఆదరిస్తారు. చాలా మంది డైరెక్టర్లు అలా కథను నమ్ముకునే కొత్త కొత్త వాళ్లతో మంచి కథలను ఎంచుకొని సినిమాలు తీస్తున్నారు. కానీ కొందరు రొటీన్ కథనే తిప్పి తిప్పి చూస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తున్నారు. అలాంటి సినిమాలు పెద్దగా పేరుకురావు. అయితే కథనే నమ్మకొని తాజాగా ఓ మూవీ రిలీజ్ అయింది. అదే ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. ఈ మూవీ ఆగస్టు 4న థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..

నటీనటులు:
రిష్వి తిమ్మరాజు
విస్మయ శ్రీ
రఘు
స్వాతి పొలిచర్ల
సుజాత
వినయ్ మహదేవ్

టెక్నీషియన్లు:
డైరెక్టర్: రాజేష్ దొండపాటి
నిర్మాతలు: పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంటక సుబ్బమ్మ, పిఎన్ కే శ్రీలత
మ్యూజిక్: సాబు వర్గీస్
సినిమాటోగ్రఫీ: ఎస్ కే రఫీ
ఎడిటింగ్: సాయిబాబా తలారి

కథ:
‘కృష్ణగాడు అంటే ఒకరేంజ్’ ఒక విలేజ్ లవ్ స్టోరీ. ఊర్లో మేకలు కాసే కృష్ణ(రిష్వి తిమ్మరాజు) తండ్రి చనిపోతాడు. దీంతో కుటుంబ భారం అతనిపై పడుతుంది. ఓ ఫంక్షన్లో అతనికి సత్య (విస్మయ శ్రీ) కలుస్తుంది. దీంతో కృష్ణ ను ఆటపట్టిస్తుంది. ఆ తరువాత అతని అమాయకత్వాన్ని చూసి అతినిని ప్రేమిస్తుంది. కృష్ణ కూడా ఆమె ప్రేమలో పడిపోతాడు. ఇదిలా ఉండగా ఊర్లో దయా (రఘు) అమ్మాయిలు, మహిళలను ఏడిపిస్తుంటాడు. ఈ క్రమంలో సత్యను ఏడిపించడం మొదలుపెడుతాడు. అయతే అప్పటికే కృష్ణతో ప్రేమలో పడిన విషయం తెలుసుకొని ఆయనతో గొడవ పడుతాడు. ఇద్దరు కొట్టుకుంటారు. అయితే కృష్ణ ను పేదవాడు అంటూ ఘోరంగా అవమానిస్తాడు. దీంతో మూడు నెలల్లో ఇల్లు కట్టి చూపిస్తా.. అని దయాతో ఛాలెంజ్ చేస్తాడు. మరి ఆ ఛాలెంజ్ ను కృష్ణ పూర్తి చేస్తాడా? లేదా అనేది కథాంశం..

విశ్లేషణ:
ఈ సినిమా కూడా కంటెంట్ ను నమ్మొకొనే థియేటర్లోకి వచ్చింది. కామెడీ, లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. వీటితో పాటు తండ్రి లేడనే ఎమోషన్స్, ఫైట్ష్ అన్నీ కలగలిపి ఉన్నాయి. అయితే దర్శకుడు కొత్తగా ఆలోచించి హీరోను మేకలు కాసే వ్యక్తిగా చూపించాడు. మిగతా సినిమాల్లో లాగే పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. దీంతో కొన్ని సీన్లు బాగున్నా.. ఓవరాల్ గా రొటిన్ కథనే తిప్పితీశారని అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ సాఫీగా సాగే సినిమా సెకండాఫ్ మొత్తం ఎమోషన్స్, ఫైట్స్ తో నింపేశారు.

ఎవరెలా చేశారంటే?
కొత్త నటుడైనా రిష్వి తన క్యారెక్టర్లో లీనమైపోయాడు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని యాక్టింగ్ ఇరగదీశాడా? అని అనిపిస్తుంది. ఆ తరువాత ప్రేమ కోసం తిరబడే పాత్రలో మెప్పిస్తాడు. హీరోయిన్ విస్మయ శ్రీ పాత్ర సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది చలాకీ పిల్లలా అలరిస్తుంది. రఘు, స్వాతి పొలిచర్ల, సుజాతలు వారి పాత్రలతో మెప్పించారు.

టెక్నీషియన్లు ఎలా చేశారంటే?
డైరెక్టర్ కథను కొత్త కోణంలో చూపించాలనుకున్నా.. కాస్తా పాత స్టోరీని జోడించడంతో కొంచెం బోర్ కొడుతుంది. కానీ మొత్తంగా విభిన్నంగా తీయాలనే ఆలోచనతో సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు మ్యూజిక్ హైలెట్ గా చెప్పవచ్చు. పాటలుమాత్రమే కాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా తమ విలువలను చూపించారు.

మొత్తంగా సినిమాలో కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. యూత్ కు మంచి కాఫీలాంటి సినిమా అని చెప్పవచ్చు.

రేటింగ్: 2/5