Kerala Politics: కేరళలో రాజకీయ పునరేకీకరణ మొదలైందా?

Kerala Politics: కేరళలో రాజకీయ పునరేకీకరణ మొదలైందా?

Written By: NARESH, Updated On : February 1, 2024 3:40 pm

కేరళ రాజకీయాలు ఇప్పటివరకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యలోనే ఉన్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలు చూస్తుంటే.. త్రిముఖ పోటీ జరిగేటట్టుగా ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు బీజేపీకి అంత ప్రాముఖ్యత లేదు. గత దశాబ్ధం నుంచి చూసుకుంటే డబుల్ డిజిట్ గానే ఉంటుంది. కానీ క్రిటికల్ మాస్ రీచ్ కాదు. ఈరోజు అది రీచ్ అయినట్టుగా కనిపిస్తోంది.

ప్రధాన కారణం.. ఎంతో ఆలోచించి సోషల్ ఇంజినీరింగ్ చేసినట్టుగా కనిపిస్తోంది. సామాజిక పరమైన అంశాలు టచ్ చేసినట్టుగా అనిపిస్తోంది. రాష్ట్రమొత్తం జనాభా లెక్కలు ఎప్పుడూ కరెక్ట్ కాదు.ప్రాంతాల వారీగా ఉంటుంది.

కేరళలో 70 శాతం క్రిస్టియానిటీ ఉందన్నది జనాభా లెక్కల ప్రకారం తెలుస్తోంది. నార్తర్న్ కేరళలో చాలా పలుచగా ఉన్నారు. కింద 9 జిల్లాల్లోనే గణనీయంగా ఉన్నారు. ఇందులో 4 జిల్లాలు అత్యధికంగా క్రిస్టియన్లు ఉన్నారు. వయనాడ్ లోనూ క్రిస్టియన్లు 20 శాతం ఉన్నారు. కాబట్టి ఓటింగ్ గణనీయంగా ప్రభావితం చేయగల నియోజకవర్గాలు 9 ఉన్నాయి. ఇది బీజేపీ సోషల్ ఇంజినీరింగ్ లో క్రిస్టియన్ ఔట్ రీచ్ కు ప్రాధాన్యం ఇచ్చింది.

కేరళలో రాజకీయ పునరేకీకరణ మొదలైందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.