https://oktelugu.com/

Karuvannur Bank Scam: 343 కోట్ల బ్యాంకు కుంభకోణం చేసిన కేరళ సీపీఎం కధ

కరువన్నార్ కోఆపరేటివ్ బ్యాంకు.. 1921లో ఒక చిన్న గ్రామంలో వ్యవసాయ సొసైటీగా మొదలైంది. ఇప్పటికీ కోఆపరేటివ్ బ్యాంకు గా ఎదిగింది. త్రిసూర్ జిల్లాలో ఈ బ్యాంకు ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : January 25, 2024 / 01:23 PM IST

    ఒక రాజకీయ పార్టీ బ్యాంకును దోచేయడం ఎప్పుడైనా విన్నారా? పార్టీగా బ్యాంకును దోచేయడం అనేది వింతగా కనిపిస్తోంది. ఇది నిజమే. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 26వేల పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసింది. వినడానికే ఆశ్చర్యం వేసింది. అది ఏంటన్నది వివరాల్లోకి వెళదాం..

    కరువన్నార్ కోఆపరేటివ్ బ్యాంకు.. 1921లో ఒక చిన్న గ్రామంలో వ్యవసాయ సొసైటీగా మొదలైంది. ఇప్పటికీ కోఆపరేటివ్ బ్యాంకు గా ఎదిగింది. త్రిసూర్ జిల్లాలో ఈ బ్యాంకు ఉంది.

    కోఆపరేటివ్ బ్యాంకులో 2011 నుంచి సీపీఐ ఆధ్వర్యాన 13 మంది డైరెక్టర్లతో ఏర్పాటు చేశారు. 2021 వరకూ పొడిగించారు. సీపీఐ పార్టీనే ఈ బ్యాంకును నడిపించేది. డైరెక్టర్లను నామమాత్రం చేసింది. సీకే చంద్రన్ అనే సీపీఐ నేతను ఈ బ్యాంకు కార్యకలాపాలను నిర్వహించేందుకు సీపీఐ ప్రభుత్వం నియమించింది.. బ్యాంకులో ఏకంగా 343 కోట్ల కుంభకోణం జరిగింది..

    343 కోట్ల బ్యాంకు కుంభకోణం చేసిన కేరళ సీపీఎం కథపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.