PM Modi and KCR : మోడీ కేసీఆర్ పై పేల్చిన బాంబు తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తుందా?

మొదటి సారి ఎన్డీఏలో చేరుతానన్న కేసీఆర్ ప్రతిపాదనకు మోడీ నో చెప్పారు. ఇక రెండోసారి కేటీఆర్ ను సీఎం ను చేసి తాను వైదొలుగుతానని.. ఆశీర్వదించాలని అడిగాడని మోడీ బయటపెట్టాడు.

Written By: NARESH, Updated On : October 5, 2023 1:16 pm

PM Modi and KCR : మోడీ నిజామాబాద్ సభ అద్భుతంగా సాగింది. జనం జోష్ కూడా ఎప్పుడూ లేనంత అద్భుతంగా ఉంది. వారి జోష్ కు తగ్గట్టుగా మోడీ కూడా అదే రీతిలో ప్రతిస్పందించారు. పంచ్ ల మీద పంచ్ లు వేశారు. లోక్ తంత్ర్.. లూప్ తంత్ర్ వంటి పంచు డైలాగులతో మోడీ డైలాగులకు జనాలను ఉర్రూతలూగించారు.

ప్రజలను రహస్యం బట్టబయలు చేయమంటారా? అంటూ కేసీఆర్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. కేసీఆర్ తనతో చేసిన సంభాషణలను బయటపెట్టి సంచలనం సృష్టించారు. ‘జీహెచ్ఎంసీ ఫలితాలు వచ్చిన వారానికి నన్ను కేసీఆర్ కలిసి ఏం అడిగాడో తెలుసా?’ అంటూ మోడీ సీక్రెట్ బయటపెట్టాడు. మేం ఎన్డీఏలో చేరుతామని.. జీహెచ్ఎంసీలో మాకు మద్దతు ఇవ్వండి అంటూ కేసీఆర్ కోరాడని మోడీ చెప్పుకొచ్చాడు.

డిసెంబర్ 5న జీహెచ్ఎంసీ ఫలితాలు విడుదల అయితే.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీని కలిసింది డిసెంబర్ 12, 2020లో కలిశాడు. అయినా కేసీఆర్ తో కలిసేందుకు తాను ఒప్పుకోలేదని.. అవినీతిపరులతో కలిసేందుకు తాను ఒప్పుకోనని మోడీ ప్రకటించారు. రెండోసారి కూడా కేసీఆర్ తన వద్దకు వచ్చి కలిశాడు.. 2021 సెప్టెంబర్ 3న కేసీఆర్ మోడీని కలిశాడు.

మొదటి సారి ఎన్డీఏలో చేరుతానన్న కేసీఆర్ ప్రతిపాదనకు మోడీ నో చెప్పారు. ఇక రెండోసారి కేటీఆర్ ను సీఎం ను చేసి తాను వైదొలుగుతానని.. ఆశీర్వదించాలని అడిగాడని మోడీ బయటపెట్టాడు.

మోడీ కేసీఆర్ పై పేల్చిన బాంబు తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తుంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.