Chandramukhi 2 Collections: చంద్రముఖి 2 వసూళ్లు… లారెన్స్ పరువు నిలబెట్టాడా? పడగొట్టాడా?

అన్ని భాషల్లో కలిపి ఇండియా వైడ్ చంద్రముఖి 2 ఫస్ట్ డే రూ. 8.3 కోట్లు, సెకండ్ డే రూ. 4.35 కోట్లు, థర్డ్ డే రూ. 5 కోట్లు, ఫోర్త్ డే రూ. 7 కోట్లు, ఫిప్త్ డే రూ. 4.6 కోట్లు, సిక్స్త్ డే రూ. 2 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.

Written By: Shiva, Updated On : October 4, 2023 12:49 pm

Chandramukhi 2 Collections

Follow us on

Chandramukhi 2 Collections: 2005లో విడుదలైన చంద్రముఖి హారర్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్. అలాంటి కథను రజినీకాంత్ లాంటి ఒప్పుకుని చేయడం గొప్ప విశేషం. బలమైన కథ అయినప్పటికీ రజినీకాంత్ ఇమేజ్ రీత్యా అటూఇటూ అయితే మొత్తానికే తేడా కొడుతుంది. అయినా దర్శకుడిని నమ్మి రజినీకాంత్ రిస్క్ చేశాడు. మంచి ఫలితం అందుకున్నాడు. ఆ చిత్రానికి సీక్వెల్ అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ ఛాలెంజ్ ని తీసుకున్న రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 చేశారు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. వసూళ్లు కూడా అలానే ఉన్నాయి.

అన్ని భాషల్లో కలిపి ఇండియా వైడ్ చంద్రముఖి 2 ఫస్ట్ డే రూ. 8.3 కోట్లు, సెకండ్ డే రూ. 4.35 కోట్లు, థర్డ్ డే రూ. 5 కోట్లు, ఫోర్త్ డే రూ. 7 కోట్లు, ఫిప్త్ డే రూ. 4.6 కోట్లు, సిక్స్త్ డే రూ. 2 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. మొత్తంగా ఇండియాలో రూ. 31 కోట్ల షేర్ వసూలు చేసింది.

తమిళ్ లో చంద్రముఖి 2 రూ. 24 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఏపీ/తెలంగాణలో రూ . 8 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. ఇక కర్ణాటకలో రూ.2.5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. కేరళలో రూ.1 కోటి గ్రాస్, రెస్టాఫ్ ఇండియా రూ. 1.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ వసూళ్లు పరిశీలిస్తే… రూ. 6 కోట్ల షేర్ వసూలు చేసింది. . మొత్తంగా 6 రోజులకు రూ. 46 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

చంద్రముఖి 2 భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో రూ. 40 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. దర్శకుడు పి. వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రాఘవ లారెన్స్ కి జంటగా కంగనా రనౌత్ నటించింది. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఈ చిత్రానికి రజినీకాంత్ మంచి ప్రచారం కల్పించారు. హీరో లారెన్స్ పలుమార్లు రజినీకాంత్ ని కలిశారు. ఈ సినిమాను ఆదరించాలని రజినీకాంత్ పిలుపునిచ్చారు.