CM KCR Politics: కేసీఆర్ కాకమ్మ కథలు వినే కాలం కాదిది అని అర్థమైంది. తెలంగాణలో కేసీఆర్ మాట చెబితే అందరూ చెవులు నిక్కరించి వినేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. కేసీఆర్ పై జనాల్లో మాటలు కోటలు దాటి.. చేతలు గడప దాటడం లేదని అర్థమైంది.

తెలంగాణ లో ప్రజలు నమ్మకపోయేసరికి.. దేశం మొత్తం ఇదే కథలు చెప్పడం ప్రారంభించారు. బీహార్ కెళ్లి కూడా ఇదే చెప్తున్నారు. దేశంలో కేసీఆర్ తిరిగే ఖర్చు అంతా తెలంగాణ ప్రజలదే. ప్రభుత్వం నుంచే కేసీఆర్ వెచ్చిస్తున్నారు. పంజాబ్ లో రైతులకు చెక్కులు.. బీహార్ లో సైనిక అమరవీరులకు చెక్ లిచ్చారు. తెలంగాణ దేశ పర్యటనలు తెలంగాణ ప్రజలు భరిస్తున్న ఖర్చులని తెలుసుకోవాలి.
ఇది వరకు మహారాష్ట్ర వెళ్లి మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిశారు కేసీఆర్. కేసీఆర్ కలిసిన తర్వాత ఉద్దవ్ సీఎంగా దిగిపోయాడు. అలాగే ఝార్ఖండ్ వెళ్లి హేమంత్ సోరెన్ ను కలిశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవి పోయి సీఎం పదవి పోవడానికి రెడీ అవుతోంది.
ఇప్పుడు బీహార్ వెళ్లి అలాగే రాజకీయం చేస్తున్నాడు. ఆర్జేడీతో నితీష్ ఎన్ని రోజులు ఉంటాడో తెలియని పరిస్థితి. ఆర్జేడీ అంటేనే అవినీతి పార్టీ. ఆయనతో కలిసి ఉండడం నితీస్ కు అసాధ్యం. అవినీతి, రక్షణ, శాంతిభద్రతల విషయంలో నితీష్ కాంప్రమైజ్ కాడు.
జార్ఖండ్ లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీహార్ లో నితీష్, ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తమిళనాడులో డీఎంకే+కాంగ్రెస్ కలిసి ఉంది. దీన్ని బట్టి కేసీఆర్ కాంగ్రెస్ పై వ్యతిరేక పోరాటం ఉట్టిదేనన్నది ఫోకస్ అవుతోంది. మెల్లిమెల్లిగా కాంగ్రెస్ కు దగ్గరకావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నది కనపడుతోంది.
కేసీఆర్ దేశ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
