Liger Collections: పూరి – విజయ్ దేవరకొండ లైగర్ రిలీజ్ కి ముందు భారీ అంచనాలున్నాయి. అయితే, రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు తలకిందులు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. నష్టాల వలయంలో ఈ సినిమా పూర్తిగా చిక్కుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు విజయ్ దేవరకొండ షాక్ లోకి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ అయినా వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి.

ముందుగా ఈ సినిమా 9 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: Surekha Vani: సురేఖా వాణి తెగింపు… ఆ హీరోకి వంద ముద్దులిస్తానంటూ ఓపెన్ ఆఫర్
నైజాం 5.69 కోట్లు
సీడెడ్ 1.85 కోట్లు
ఉత్తరాంధ్ర 1.77 కోట్లు
ఈస్ట్ 0.88 కోట్లు
వెస్ట్ 0.56 కోట్లు
గుంటూరు 0.99 కోట్లు
కృష్ణా 0.71 కోట్లు
నెల్లూరు 0.54 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్) cr
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 9 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 12.99 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 25.11 కోట్లు వచ్చాయి.
తమిళనాడు 0.33 కోట్లు
కేరళ 0.29 కోట్లు
కర్ణాటక 0.98 కోట్లు
హిందీ 8.23 కోట్లు
ఓవర్సీస్ 3.40 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 9 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 26.22 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 54:43 కోట్లను కొల్లగొట్టింది

లైగర్ చిత్రానికి తెలుగు థియేట్రికల్ బిజినెస్ 55 కోట్లు జరిగింది. కానీ, 9 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ లెక్కలను బట్టి నష్టాలను అంచనా వేస్తే.. ఈ సినిమాకి 35 కోట్ల వరకు భారీ నష్టాలు రానున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. మరోవైపు లైగర్ ప్లాప్ పరాభవాన్ని ప్రేక్షకులు త్వరగా మర్చిపోవడానికి విజయ్ దేవరకొండ టీమ్ కొత్త ఐడియాలు ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ఫేక్ కలెక్షన్స్ ను పెట్టి.. సోషల్ మీడియాలో భారీ కలెక్షన్స్ అంటూ పెయిడ్ ప్రమోషన్స్ చేయిస్తున్నారు. ముఖ్యంగా హిందీలో ఈ తరహా ప్రమోషన్స్ మరి ఎక్కువగా ఉన్నాయి. అయినా లేని కలెక్షన్స్ ను ఉన్నాయని చూపించే బదులు… ముందు నుంచే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనే జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ప్రస్తుతం విజయ్ దేవరకొండ అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే, పూరితో తాను ప్లాన్ చేసిన మరో సినిమా జనగణమన సినిమాని కూడా ఆపేయాలని విజయ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
[…] […]
[…] […]