KCR Jagan: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరుసగా ఢిల్లీబాట పడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారమే ఢిల్లీ చేరుకోగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహనరెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇద్దరూ దేశ రాజధాని వెళ్తున్నా.. ఇద్దరి ఎజెండాలు వేరు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ధాన్యం యాసంగి ధాన్యం కొనుగోలు విషయమై ప్రధాని మోదీతో యుద్ధం చేసేందుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం మోదీతో సఖ్యత కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆర్థిక సంక్షోభంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధానిని కోరనున్నట్లు తెలిసింది.

-వారం వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారం వ్యవధిలో రెండోసారి ఢిల్లీ వెళ్లారు. మార్చి 29న ఆయన పంటినొప్పి కారణం చెబుతూ ఢిల్లీ వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసుకుంటారని సీఎంవో నుంచి ఒక ప్రకటన విడుదల చేయించారు. మార్చి 29న షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ వేములవాడకు రావాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఒకరోజు ఢిల్లీలోనే ఉండి తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. కానీ వైద్య పరీక్షలు ఎక్కడ చేయించుకున్నారు. వైద్యులు ఏం చెప్పారు అనే విషయం మాత్రం బటయకు చెప్పలేదు. తాజాగా ఆదివారం రాత్రి మళ్లీ వైద్య పరీక్షల కోసమే అంటూ కేసీఆర్ తన భార్య శోభ, కూతురు, ఎమ్మెల్సీ కవితను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. యాసంగి ధాన్యం కొనుగోలు చే యాలని ఈనెల 11న ఢిల్లీలో టీఆర్‌ఎస్ ధర్నా చేయాలని నిరణయించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన ఉత్తరాదికి చెందిన రైతు సంఘాల ముఖ్య నాయకులను ఈ ధర్నాకు ఆహ్వానించాలని సీఎం యోచిస్తున్నారు. రాకేశ్ టికాయతతోపాటు ఇతర ముఖ్య నాయకులతో ఆయన ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉంది.
-ఏపీ ముఖ్యమంత్రికి ప్రధాని అపాయింట్‌మెంట్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈమేరకు పీఎంవో కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు.. కేబినె విస్తరన వేళ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనలో ఆర్థికంగా చాలా ఇబదులు పడుతున్న ఆంధ్రప్రదేశని ప్రత్యేకంఒగా పరిగణించాలని జగన ప్రధానిని కోరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత తరుణంలో కేంద్రం నుంచి ప్రత్యేక మినహాయింపులు తేకుంటే ఆర్థికంగా బైటపడలేమని ప్రధానికి వివరిస్తారని సమాచారం. దీనితోపాటు విభజన చట్టం పరిధిలోలని రెవన్యూలోటు భర్తీతోపాటుగా సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరింతగా రుణపరిమిత పెంపుకోసం అనుమతులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గతంలో జగన్ ప్రధానిని పోలవరం సవరించిన అంచనాలపై అభ్యరుఇ్ఠఠంచినా ఎలాంటి భారోసా రాలేదు దీంతో కనీసం ఈ పర్యటనలో అయినా పోలలవరం నిధుల విషయమై ప్రధాని నుంచి స్పష్టమైన హామీ పొందాలని పొందాలని భావిస్తున్నారు. పునర్విభజన చట్టం ద్వారా ఏపీకి కేటాయించాల్సిన ప్రాజెక్టులు, మూడు రాజధానుల వ్యవహారంపై కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.
-ప్రధాని నుంచే పిలుపు..
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ జగన్‌ను పిలిపించి ఉంటారన్న చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో పరిణాంఆలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే అంశంపైనా ప్రధాని సీఎం మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు ప్రధానితో సీఎం జగన్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. అయితే ప్రధానితో తాను ఏం చర్చించారో సీఎం జగన బయటకు చెప్పరు. ఇది ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కొనసాగిస్తున్నారు. తాజాగా ఏం చెబుతారనే ఆసిక్త కూడా ఎవరికీ లేదు. కానీ తాజా సమావేశం మాత్రం సర్వత్రా ఆసక్తిగా ఉంది.
[…] […]