KCR Bandi Sanjay : పంతం పడితే పగోడికి రాజకీయ జీవితం లేకుండా చేసేదాకా నిద్రపోడు కేసీఆర్. ఆయనతో కలిసి మెలిగిన విజయశాంతి, ఆలె నరేంద్ర నుంచి నేటి ఈటల రాజేందర్ వరకూ అందరికీ రాజకీయంగా గడ్డు పరిస్థితులను సృష్టించిన ఘనత కేసీఆర్ దే.. పంతం నీదా నాదా సై అంటూ తొడగొట్టేస్తారు.

తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ వైరం గురించి తెలియని వారుండరు. ఇటు బండి.. అటు కేసీఆర్ లు సభలు, సమావేశాల్లో బండ బూతులు తిట్టుకుంటారు. ‘తాగి పంటడు’ అని బండి సంజయ్ అంటే.. ‘జర్దా తింటాడు బొక్కలిరుస్తా బిడ్డా’ అని కేసీఆర్ తిట్టిపోస్తాడు.
వీళ్ల తిట్లు భరించలేక వీరి వైరం చూడలేక అందరూ ఈసడించుకున్నా ఇద్దరి వాగ్ధాటి మాత్రం తగ్గనే తగ్గదు.. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చిన సందర్భంగా అరుదైన దృశ్యం కనువిందు చేసింది.
రాష్ట్రపతికి నేతలను పరిచయం చేసేందుకు కేసీఆర్ ఆమె పక్కన నిలుచోగా.. కేసీఆర్ ఉన్నాడని బండి సంజయ్ ఆగారు. కానీ పగోడు అయినా సరే బండి సంజయ్ ను పిలిచి రాష్ట్రపతికి ఈయన తెలంగాన బీజేపీ చీఫ్ అని కేసీఆర్ పరిచయం చేసి హుందాగా ప్రవర్తించాడు. పాత పగలన్నీ మాని ఈ పనిచేశాడు.
కానీ బండి సంజయ్ మాత్రం కేసీఆర్ పిలుపును పట్టించుకోలేదు. కేసీఆర్ పిలిచినా ఆయన వైపు కనీసం చూపు తిప్పకుండా.. కనీసం ఆయన ముఖం కూడా చూడకుండా బండి సంజయ్ నేరుగా రాష్ట్రపతికి దండం పెట్టి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ ఇద్దరి వైరిపక్షాలు ఒకేవేదికపై ఇలా కలిసిన వీడియో వైరల్ అవుతోంది.