KCR Tamilsai: కొన్ని చిత్రాలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ విడ్డూరాన్ని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఎందుకు అంతలా పంతం పడుతారో తెలియదు. ఆ పంతాన్ని ఒక్క మాటను పక్కనపెట్టి నుదుటిపై చిరునవ్వులు చిందిస్తూ పగోడు అయినా సరే ఆప్యాయంగా పలకరిస్తారు.. ముసి ముసి నవ్వులతో కలిసిపోతారు.. ఈ రాజకీయం అంటేనే ఇంత బై అని సర్దుకుపోవాల్సిందే మరీ..

‘వెంటపడ్డావా? వేటాడేస్తా’ అన్నట్టుగా ఉంటుంది కేసీఆర్ స్టైల్. కేసీఆర్ తో ఆట.. సింహంతో వేట అని గులాబీ శ్రేణులు కథలు కథలుగా చెబుతారు. టీవీ9 సీఈవో రవిప్రకాష్ నుంచి నయీం, టీఆర్ఎస్ సీనియర్ నేతలు విజయశాంతి, ఆలె నరేంద్ర, ఈటల రాజేందర్ వరకూ కేసీఆర్ చేతిలో బాధితులే. వ్యూహాత్మకంగా వారిని పక్కకు తప్పించి తన చేతికి మట్టకుండా వదిలించుకోవడంలో కేసీఆర్ స్టైలే వేరు.

అలాంటి కేసీఆర్.. ప్రస్తుతం బీజేపీపై పంతం పట్టి ఆ పార్టీపై పోరాడుతున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో దానికి ప్రత్యామ్మాయంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు.‘బీఆర్ఎస్’ పార్టీ స్థాపించి బీజేపీని ఓడించాలని పంతం పట్టారు.
ఇక మోడీ స్వయంగా హైదరాబాద్ వచ్చినా కలవకుండా కర్ణాటక వెళ్లిపోయిన పంతం కేసీఆర్ ది. బీజేపీ నేతలంటే ఒంటిపై చీమలు పాకినంత కంపరంగా కేసీఆర్ భావించారు. బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి వరకూ అందరినీ తిట్టిపోశారు.ఇక గవర్నర్ తమిళిసైని అయితే బహిష్కరించారు. ఆమె తెలంగాణలో ఎక్కడ పర్యటించినా అధికారులను పంపకుండా.. ప్రొటోకాల్ పాటించకుండా అవమానించేశారు. దీంతో ఢిల్లీ వెళ్లి తన బాధను మోడీ, షాలకు చెప్పి మరీ తమిళిసై బోరుమన్నది.

ఇక తమిళి సై సైతం కేసీఆర్ ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించింది. హుజూరాబాద్ నేతకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం.. కొన్ని బిల్లులను పాస్ చేయకపోవడం.. కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పాలనలో వేలు పెట్టడంతో వీరిద్దిరి మధ్య వైరం ముదిరిపాకాన పడింది.
కానీ ఈరోజుతో వీరిద్దరూ తమ పంతాలు పట్టింపులు పక్కనపెట్టారు. తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కేసీఆర్ తన కోపాన్ని పక్కనపెట్టి రాజ్ భవన్ కు వచ్చేశారు. తమిళిసై సైతం కేసీఆర్ రాకతో మురిసిపోయి ఓ శాలువ కప్పి సన్మానించింది. కేసీఆర్ కూడా రాని నవ్వును మోముపై తెచ్చుకొని తమిళిసైతోనూ కిషన్ రెడ్డితో సరదాగా జోకులేస్తూ కలిసిపోయారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ప్రస్తుతానికైతే ‘సమాప్తం’ అయ్యింది. మరి ఇది ఈ కార్యక్రమానికే పరిమితమా? లేదా? మున్ముందు కొనసాగుతుందా? అన్నది వేచిచూడాలి.
[…] […]