
KCR and KTR separated? : ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తాతలు, తండ్రులు, తోడికోడళ్ల నుంచి మనవళ్ల వరకూ అంతా ఒకటే ఫ్యామిలీ. కానీ ఇప్పుడు.. ఒక తండ్రి, తల్లి ఇద్దరూ ఉంటే ఇదే ఉమ్మడి ఫ్యామిలీ.. నాటికి నేటి చాలా మారింది. పెళ్లి అయితే చాలు వేరు పడిపోతున్నారు. జాయింట్ ఫ్యామిలీలు మచ్చుకైనా కనిపించవు. తెలంగాణను ఏలుతున్న కేసీఆర్ ఫ్యామిలీ కూడా విడిపోయారని ఓ కాంగ్రెస్ ఎంపీ బాంబు పేల్చాడు. కేసీఆర్ కు కూతురు, కొడుకు.. కూతురు ఇప్పటికే వేరుగా ఉంటుంది. ఉన్న ఒక్క రాజకీయ వారసుడు కేటీఆర్ కూడా దూరం జరిగాడా? కేసీఆర్ కు దూరంగా బతుకుతున్నాడా? ఇదంతా నిజమేనా? అన్న అనుమానాలు ఆ ఎంపీ మాటలతో వ్యక్తమవుతున్నాయి.. ఇందులో అసలు లోగుట్టు ఏమిటి అన్నది ఆసక్తి రేపుతోంది.
తెలంగాణలో ప్రగతి భవన్ పునాది వేసినప్పటి నుంచి రాజకీయ విమర్శలకు ప్రతివిమర్శలకు కేంద్రంగా ఉంది. తెలంగాణలో ఇతర సమస్యలేమీ లేవనట్టు ప్రగతి భవన్ పైనే ప్రతిపక్షాలు ఫోకస్ ఉంటోంది. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం ప్రగతి భవన్ లో నివాసం ఉంటోంది. కేసీఆర్ తో పాటు ఆయన భార్య, కొడుకు కేటీఆర్, కోడలు, మనవడు ప్రగతిభవన్ లో ఉంటున్నారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ఇంటర్యూలో కోమటరెడ్డి వెంకటరెడ్డి ప్రగతి భవన్ రహస్యాన్ని బట్టబయలు చేశారు.
కోమటిరెడ్డి వెల్లడించిన సమాచారం మేరకు ప్రగతి భవన్ లో కేసీఆర్, ఆయన భార్య మాత్రమే ఉంటున్నారని తెలుస్తోంది. కొడుకు కేటీఆర్… ఆయన కుటుంబం ప్రగతి భవన్ కాంపౌండ్ లోని మరో ఇంట్లో నివాసం ఉంటున్నట్టు కోమటిరెడ్డి తెలిపారు. ఉన్నదే ఐదుగురు కుటుంబ సభ్యులు .. వారికి అంత పెద్ద బిల్డింగ్ అవసరమా అనుకోవచ్చు. కానీ కేసీఆర్ కుటుంబంలో బీఆర్ఎస్ నిప్పులు పోసిందని ప్రతిపక్షాలు గుసగుసలాడుతున్నాయి. బీఆర్ఎస్ ఏర్పాటు కేటీఆర్ కు ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తండ్రికి ఎంత సర్ది చెప్పినా కేటీఆర్ మాట వినలేదని తెలుస్తోంది. దీంతో కేటీఆర్ తండ్రితో కలసి ఉండలేక.. ప్రగతి భవన్ కాంపౌండ్ లోని మరో బంగ్లాలో నివాసం ఉంటున్నారట. కేటీఆర్ ఉంటున్న నివాసంలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండేవారు. ఇప్పుడు కేటీఆర్ ఆ బంగ్లాను వాడుకుంటున్నారని సమాచారం.
బీఆర్ఎస్ తో దేశవ్యాప్తంగా ప్రభావం చూపడం తెలంగాణలో అధికారం సాధించినంత ఈజీ కాదని కేటీఆర్ భావిస్తున్నారట. అందుకే బీఆర్ఎస్ ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని టాక్ నడుస్తోంది. కేసీఆర్ తన పట్టు వీడకపోవడంతో తండ్రికి ఎదురు చెప్పలేక వేరు కాపురం ఉంటున్నారని ఒక ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే చెల్లి కవితతో కూడా కేటీఆర్ కు సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఇంత రాద్దాంతం జరుగుతున్నా కేటీఆర్ ఒక్క రోజు కూడ పల్లెత్తు మాట మాట్లాడలేదు. తనకు సంబంధం లేదన్నట్టుగా దూరంగా ఉంటున్నారు.
కేసీఆర్ మాత్రం దేశవ్యాప్తంగా బీజేపీని దెబ్బకొడతానంటూ బయలుదేరాడు. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఘనంగా సభను నిర్వహించారు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత ఒకటి ఉంది. ఇప్పుడు కేసీఆర్ కు అది సరిగ్గా అతుకుతుంది. ఇంట్లోని కొడుక్కే బీఆర్ఎస్ ఏర్పాటు ఇష్టం లేదన్న ప్రచారం ఉంది. అందుకే కేటీఆర్ యాక్టివ్ గా పాల్గొనడం లేదని అంటున్నారు. అలాంటిది కేసీఆర్ బీజేపీని ఢీకొట్టగలరా ? అన్న సందేహం కలుగక మానదు. తెలంగాణలో దశాబ్దానికి పైగా కేసీఆర్ కష్టపడ్డారు. టీఆర్ఎస్ ను నిర్మించారు. అధికారంలోకి వచ్చారు. కానీ టీఆర్ఎస్ నిర్మాణం జరిగినంత ఈజీగా బీఆర్ఎస్ నిర్మాణం జరగదు. దీనికి ఎన్నో పరిమితులు ఉన్నాయి. వీటిని అధిగమించడం కేసీఆర్ అనుకున్నంత ఈజీ కాదు అనేది స్పష్టం. ఏది ఏమైనా కోమటిరెడ్డి పేల్చిన బాంబ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందనడంలో సందేహం లేదు. బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాల్సిన సంకట స్థితిలోకి నెట్టివేయబడిందనేది మాత్రం వాస్తవం. మరి బీఆర్ఎస్ నేతలు కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తారో.. మౌనమే సమాధానమంటూ సమర్థిస్తారో వేచిచూడాలి.