
Unstoppable with NBK show Pawan Kalyan : ఆహా మీడియా ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అన్ స్టాపబుల్’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఇటీవలే అప్లోడ్ అయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే..మొదటి ఎపిసోడ్ కి ఆల్ టైం రికార్డ్ వ్యూస్ రాగా , రెండవ ఎపిసోడ్ ని నిన్ననే విడుదల చేసారు.మొదటి ఎపిసోడ్ కంటే రెండవ ఎపిసోడ్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఎక్కువ..రెస్పాన్స్ అయితే అదిరింది.
కానీ మొదటి ఎపిసోడ్ కి వచ్చినన్ని వ్యూస్ రెండవ ఎపిసోడ్ కి రాలేదు, మొదటి ఎపిసోడ్ కి కేవలం 14 గంటల్లోనే 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.ఇది ఆల్ టైం ఫాస్టెస్ట్ రికార్డుగా చెప్పుకోవచ్చు,కానీ రెండవ ఎపిసోడ్ కి ఆ వంద మిలియన్ వ్యూస్ 24 గంటలకు వచ్చాయి.కానీ రెండవ ఎపిసోడ్ లో కంటెంట్ ఉండడం వల్ల లాంగ్ రన్ లో అత్యధిక వ్యూస్ సాధించిన ఎపిసోడ్ గా నిలిచిపోతుందని అంటున్నారు విశ్లేషకులు.
రెండవ ఎపిసోడ్ మొత్తం పాలిటిక్స్ మీదనే ఎక్కువ ప్రశ్నలు అడిగారు.ముఖ్యంగా ఇప్పటం గ్రామప్రజలు ఇళ్ళని ప్రభుత్వం కూల్చి వేసినప్పుడు ఒక పెద్దావిడ మీడియా ముందుకొచ్చి ఏడవడం కోట్లాది మంది ప్రజల మనసుల్ని కలిచి వేసింది.ఆమెకి మరియు ఇప్పటం గ్రామా ప్రజలకు అండగా పవన్ కళ్యాణ్ నిలబడడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది, ఆమె ఈ షో కి అతిథి గా వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
అలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ ఎపిసోడ్ అభిమానులను భావోద్వేగానికి గురి చేసేలా చేసింది..ఇక ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ ఎంట్రీ ఇవ్వడం కాసేపు సరదాగా పవన్ కళ్యాణ్ తో బాలయ్య తో చిట్ చాట్ చెయ్యడం వంటివి ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచాయి.పవన్ కళ్యాణ్ మనోగతం తెలుసుకోవాలని ఎంతో తాపత్రయపడే అభిమానులకు ఈ ఎపిసోడ్ ఒక మధుర జ్ఞాపకం లాగ నిలిచిపోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.