
MLC Kavitha – ED : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత గురువారం మరోసారి ఈ డి విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్ళనున్నారు. స్కాంలో కవితను వీడి అధికారులు ప్రశ్నించనున్నారు. రెండోసారి కవిత విచారణ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మార్చి 11న అధికారులు కవితను 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఇక స్కామ్ కేసులో బుచ్చిబాబును బుధవారం ఈడి అధికారులు ప్రశ్నించారు. అరుణ్ పిళ్ళయిని కూడా ఈడి అధికారులు విచారించారు. లిక్కర్ పాలసీ రూప కల్పన, ఐటీసీ కోహినూర్ హోటల్లో సమావేశాలు, తీసుకున్న ముడుపులపై వీడి అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఇక కన్ ఫ్రంటేషన్ పద్ధతిలో ప్రశ్నించేందుకు అరుణ్ కస్టడీ పొడిగించాలని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నది. ఇక కవిత విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పలువురు, భారత రాష్ట్ర సమితి నాయకులు ఢిల్లీ వెళ్లారు.
మార్చి 11న నిర్వహించిన విచారణలో కవిత ఈడి అధికారులు అడిగిన ప్రశ్నలకు తెలియదు అనే సమాధానం చెప్పింది. ఉదయం ఈడీ ఆఫీసులోకి నవ్వుకుంటూ వెళ్లిన కవిత.. రాత్రి తిరిగి వచ్చే సమయానికి కూడా అదే ముఖంతో ఉంది. కానీ విచారణను ఉంచుకునేందుకు ఏకంగా సుప్రీంకోర్టు గడప తొక్కింది. అంతకుముందు దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తానని పేర్కొన్న కవిత.. యూటర్న్ తీసుకుంది. కానీ సుప్రీంకోర్టు కవిత పిటిషన్ తో ఏకీభవించలేదు. మరోవైపు ఈడి అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని కవిత వివరించింది.. వాస్తవానికి ఈడి అధికారులు విచారణ సమయంలో ఎటువంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించరు. ఈ విషయాన్ని కవిత మరిచిపోయి లేనిపోని ఆరోపణలు చేసింది.
అయితే గత విచారణలో ఇటువంటి సమాధానం రాబట్ట లేకపోయిన ఈడి అధికారులు.. ఈసారి మాత్రం ఈ కేసుకు సంబంధించి పలు కీలకమైన విషయాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.. వారం నిర్వహించిన విచారణలో బుచ్చిబాబు, అరుణ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ విషయాల ఆధారంగానే కవితను మరింత లోతుగా ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సమయతమవుతున్నట్టు సమాచారం.
ఇక కవిత విచారణ నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్, భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు మొత్తం ప్రగతి భవన్ వద్ద ఉన్నట్టు సమాచారం అందుతున్నది. మార్చి 11 మాదిరే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసు అధికారులు ఢిల్లీలో తిష్ట వేసినట్టు తెలుస్తోంది.