
Kavitha vs ED : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత ఢిల్లీ వెళ్లిన తర్వాత విచిత్రంగా మాట్లాడుతున్నారు. పెద్దపెద్ద ఉదాహరణలు చెబుతున్నారు. తనను విచారణ చేయాలనుకుంటున్న దర్యాప్తు సంస్థలు తన ఇంటికి రమ్మంటే రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కవిత ప్రెస్‌మీట్ చేసిన వారు ఏంటి కవిత ఇలా మాట్లాడుతోందని తలలు పట్టుకుంటున్నారు.
ఈడీ ఇంటికి రానందని..
ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిందని తెలిపారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల నేపథ్యంలో 15 తర్వాత విచారణకు వస్తానని చెప్పానని ఈడీ అనుమతించలేదని తెలిపారు. ఈనెల 11న విచారణకు రావాలని చెప్పినట్లు పేర్కొన్నారు. తర్వాత తనను విచారణ చేసేందుకు ఈడీని ఇంటికి రావాలని కోరానని అందుకు కూడా ఈడీ అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎవరితో అయినా కలిపి విచారణ చేయాలనుకుంటే వారిని కూడా తన ఇంటికి తీసుకురావాలని కోరినా పట్టించుకోలదని చెప్పుకొచ్చారు. మహిళగా ప్రజాప్రతినిధిగా తాను చేసిన రిక్వెస్టులను ఈడీ తోసిపుచ్చిందని వాపోయారు. చివరక విచారణకు హాజరవుతానని చెప్పారు.
ఈడీ ఏమైనా మీ చుట్టమా..
ఈడీని రమ్మనగానే రావడానికి అదేమైనా కవిత చుట్టమా. ప్రజాప్రతినిధి అయినై, ప్రజలు అయినా, ధనవంతుడైనా, పేదవాడు అయినా దర్యాప్తు సంస్థల ముందు ఒక్కటే. రాజ్యాంగంలో మహిళలను ఇంటి వద్ద విచారణ చేయాలని నిబంధన ఉందని చెబుతున్న కవిత లిక్కర్ స్కాం చేసినప్పుడు తాను మహిళను అన్న విషయం మర్చిపోయారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. లిక్కర్ స్కాంపై చర్చిచేందుకు ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్స్ వేసుకుని ఢిల్లీకి వెళ్లిన కవిత విచారణకు మాత్రం వెళ్లడాడనికి వెనుకాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. Éì ల్లీకి వెళ్లడం వీలుకాని, చేతకాని మహిళలను మాత్రమే దర్యాప్తు సంస్థలు ఇంటి వద్ద వీలుంటుంది. అన్నిటికీ ఢిల్లీకి ఫ్లైట్లలో వెళ్లే కవిత ఈడీని ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
బీఎస్ సంతోష్ ప్రస్తావన..
చివరకు విచారణకు ఈనెల 11న ఢిల్లీ ఈడీ ఆఫీస్‌కు వెళ్లానని చెప్పిన కవిత ఈ సందర్భంగా మీడియా ముందు బీజేపీ నేత బీఎల్.సంతోష్ ప్రస్తావన తెచ్చారు. వాళ్లు విచారణకు తప్పించుకుంటారు. తాను తప్పించుకోను. ధైర్యంగా ఎందుర్కుంటా అని చెబుతూనే తమ ముఖ కవలికల్లో తెలియని టెన్షన్‌న ప్రదర్శించారు. సంతోష్‌లాగా తాను విచారణను తప్పించుకోవడం లేదని, ఈడీకి సహకరిస్తానని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించిన సంతోష్ విచారణను తప్పించుకునేందుకు కోర్టుకు వెళ్లాడని గుర్తుచేశారు. మొత్తంగా మహిళా బిల్లు కోసం ఢిల్లీ వెళ్లిన కవిత తాను వెళ్లిన పని మర్చిపోయి.. తన గురించి, ఈడీ గురించి ప్రెస్‌మీట్ పెట్టాల్సి రావడం చర్చనీయాంశమైంది.