KA Paul : కేఏ పాల్ మళ్లీ ఏశాడు

ఇటీవల కేఏ పాల్ తన ప్రజాశాంతి పార్టీలోకి బాబు మోహన్ ను చేర్చుకున్నారు. ఆయన గతంలో టిడిపిలో పనిచేశారు. భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజెపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. ఇన్ని పార్టీలు మారిన ఆయన చివరిగా ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయన చేరికను పాల్ గొప్పగా చెప్పుకుంటున్నారు.

Written By: NARESH, Updated On : March 5, 2024 8:37 pm

KA Paul

Follow us on

KA Paul : అత్యంత సీరియస్ గా సాగుతున్న ఏపీ రాజకీయాలలో కేఏ పాల్ ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో వాతావరణం మారిపోయింది. కొద్దిరోజులుగా తెలంగాణ కు మాత్రమే పరిమితమైన పాల్.. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏపీలోకి ప్రవేశించారు. వస్తూ వస్తూనే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు మొదలుపెట్టారు.. మంగళగిరిలో బీసీ గర్జన పేరుతో చంద్రబాబు నాయుడు నిర్వహించిన భారీ సభను ఉద్దేశించి ఆయన ఆరోపణలు చేశారు..”ఎర్రం నాయుడు బీసీ నాయకుడు. అప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేయలేదు. ఎంతోమంది బీసీలను చంద్రబాబు ఎదగనీయలేదు. రాష్ట్రంలో 60 శాతం జనాభా ఉన్న బీసీలను ఆయన పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోలేదు కాబట్టే చాలామంది నాయకులు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు.. మూడు శాతం జనాభా ఉన్నవాళ్లు మనల్ని పాలిస్తున్నారు. ఈ ముఠా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటూ” పాల్ సంచలన వీడియో విడుదల చేశారు..

కేఏ పాల్ వ్యాఖ్యల తాలుకూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.” ఇన్నాళ్ళూ సీరియస్ గా ఉన్న రాజకీయాలను చూసాం. ఇప్పుడు వాటి నుంచి ఉపశమనం కలుగుతోంది. జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పరస్పర విమర్శలు చేసుకోవడం పైనే దృష్టి సారిస్తున్నారు. పాల్ మాత్రం కామెడీ పండిస్తున్నారు. మంగళగిరి సభ ద్వారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా విమర్శలు చేస్తే.. అదే పాల్ చంద్రబాబునాయుడిని ఉద్దేశించి జబర్దస్త్ స్కిట్ రూపంలో విరుచుకుపడ్డారు. కే ఏ పాల్ ఇలాంటి కామెడీ వీడియోలు ఇంకా చాలా విడుదల చేస్తే మాకు శివభారం తగ్గుతుందంటూ” నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇటీవల కేఏ పాల్ తన ప్రజాశాంతి పార్టీలోకి బాబు మోహన్ ను చేర్చుకున్నారు. ఆయన గతంలో టిడిపిలో పనిచేశారు. భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజెపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. ఇన్ని పార్టీలు మారిన ఆయన చివరిగా ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయన చేరికను పాల్ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏపీ ఎన్నికల్లోనూ తన పార్టీ తరఫున ఇదే విషయాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. మరి బాబు మోహన్ ఐనా పాల్ ను ఎంపీగా గెలిపిస్తారా? లేక ఎమ్మెల్యేని చేస్తారా? ఏమో వీటికి కాలమే సమాధానం చెప్పాలి.