Jubilee Hills Land Scam : జూబ్లీహిల్స్ సొసైటీ వివాదం ఇప్పుడు మీడియా అధిపతుల మెడకు చుట్టుకుంది. అసలు ఏమిటీ జూబ్లీహిల్స్ సొసైటీ వివాదం ఏమిటి? ఇది ఎందుకు వివాదమైంది.
జూబ్లీహిల్స్ అనేది 1960లో రాళ్లు, రాప్పలు, నివాసయోగ్యం కానీ ఒక ప్రాంతంగా హైదరాబాద్ శివారున ఉండేది. దీన్ని బంజారాహిల్స్ ఎక్స్ టెన్షన్ అని కూడా అనేవారు. అటువంటి ప్రాంతం ఇవాళ ఆసియాఖండం మొత్తం మీద ఇంత ధనవంతమైన నివాసప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. చైనాతోపాటు దేశంలోని ఎన్నో నగరాలు ఉన్నా కూడా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఇప్పటికీ ఖరీదైన ప్రాంతంగా ఉంది. జూబ్లీహిల్స్ లో అసలు పేదవారే లేరు. దీనికి కారణం జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీనే కారణం. ఇది 1962లో స్తాపించబడింది.
1964లో ఏపీ ప్రభుత్వం 1395 ఎకరాల జూబ్లీహిల్స్ భూములను సొసైటీకి కేటాయించింది. ఈ 1400 ఎకరాల్లోంచి ఐదు సొసైటీలకు భూమిని పంచింది. ఇందులో జర్నలిస్ట్ కాలనీ, నందగిరి హిల్స్, శ్రీవేంకటేశ్వర హౌసింగ్ సొసైటీ, డెక్కన్ అపోలో హాస్పిటల్స్ , ఫిలింనగర్ లకు 218 ఎకరాలను వీరికి కేటాయించారు. మిగిలిన 1167 ఎకరాలు ఈ సొసైటీ కింద మిగిలి ఉంది.
ఈ సొసైటీ సభ్యులకే ఫ్లాట్ లు ఇస్తారు ఇక్కడ. ఈ సొసైటీలో డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ విధంగా డబ్బున్న వాళ్లకే ఈ సొసైటీ ఉండి వారికే స్థలాలు ఇచ్చింది. మరి ఈ జూబ్లీహిల్స్ సొసైటీ వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? ఈ కుంభకోణం ఎలా జరిగిందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.