Janasena Government : గత రెండురోజులు చూస్తే ఏపీ రాజకీయాల్లో జనసేననే ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. ఇక నుంచి భవిష్యత్ అంతా అలాగే ఉండనుంది. తొలిరోజు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ లో విశాఖ ఘటనపై సమీక్షించారు. విశాఖలో బాధలు పడ్డ వారిని జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా సన్మానించారు.
విశాఖలో వైసీపీ ఎలా నిర్బంధించింది..? ఎలా కుట్ర పన్నింది? ఎలా అరెస్ట్ చేసింది? అన్న దానిపై జనసేన వీడియోతో వైసీపీని ఎండగట్టింది. విశాఖలోని పరిణామాలతో రూపొందించిన ఈ వీడియోను అందరూ చూడాలని.. పోలీసుల దమనకాండను ఈ వీడియో చూపిస్తుందని పవన్ తెలిపారు. ఈ వీడియో వైసీపీ అరాచకాలను కళ్లకు కడుతోంది.
తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు పెట్టినప్పుడు ఎలాంటి జనాభిమానం ఉందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అదే క్రేజ్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే వచ్చేది జనసేన ప్రభుత్వం అని ఘంఠాపథంగా చెప్పొచ్చు. ఇది ఎవరి పల్లకీ మోయడానికి చెప్పడం లేదని.. ప్రజానాడిని బట్టి తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.