Producer Dil Raju Son: యాభై ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. టాలీవుడ్ ని శాసించే నైజాం నవాబు అయ్యాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అంటే ప్రేక్షకులకు మంచి విశ్వాసం ఉంది. భార్య అనిత సమర్పణలో దిల్ రాజు అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ నిర్మించారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో అనారోగ్యంతో మరణించారు. తన లక్ సెంటిమెంట్ గా భావించే అనిత మరణం దిల్ రాజును కృంగదీసింది.

భార్య మరణం తర్వాత దిల్ రాజు ఒంటరి జీవితం గడిపారు. అనూహ్యంగా దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్నారు. దిల్ రాజు సెకండ్ మ్యారేజ్ పై అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. అవన్నీ పుకార్లే అనుకుంటున్న తరుణంలో అధికారిక ప్రకటన వచ్చింది. 2020లో యాభై ఏళ్ల దిల్ రాజు తనకంటే చిన్నదైన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
దిల్ రాజుకు ఒక కూతురు ఉన్నారు. ఆమెకు వివాహం కాగా అమెరికాలో ఉంటున్నారు. కూతురు అనుమతితో దిల్ రాజు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. కూతరు దగ్గరుండి దిల్ రాజు వివాహం చేసింది. దిల్ రాజు సెకండ్ మ్యారేజ్ కి ప్రధాన కారణం వారసుడు కావాలనే కోరికని సమాచారం. నిర్మాతగా అతి పెద్ద సామ్రాజ్యం నిర్మించిన దిల్ రాజుకు వారసుడు లేడన్న వేదన ఎప్పటి నుండో వెంటాడుతుంది. కోరుకున్నట్లు దిల్ రాజుకు వారసుడు కలిగాడు. ఇదే ఏడాది ఆయన మరోసారి తండ్రి అయ్యాడు.

కొడుకు పుట్టడంతో దిల్ రాజు ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. ఇండస్ట్రీ వర్గాలకు, బంధు మిత్రులకు పెద్ద పార్టీ ఇచ్చారు. కాగా దిల్ రాజు తన కొడుకు ఫోటో బయటకు రాకుండా చూసుకున్నారు. అప్పుడప్పుడు మీడియా ట్రై చేసినా ముఖం మాత్రం కనబడనివ్వలేదు. ఎట్టకేలకు దిల్ రాజు కొడుకు ఫోటో లీకైంది. వారసుడు సినిమా సెట్స్ కి దిల్ రాజు కొడుకుని తీసుకెళ్లారు. హీరో విజయ్ దిల్ రాజు కొడుకుని ఎత్తుకొని ముద్దాడాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నెటిజెన్స్ పిల్లాడివి దిల్ రాజు పోలికా లేక వాళ్ళ అమ్మ పోలికలా అనే చర్చకు తెరలేపారు. అలాగే చాలా క్యూట్ గా ఉన్నాడంటూ లవ్లీ కామెంట్స్ చేస్తున్నారు.