Jaggareddy vs Sharmila: వైఎస్ఆర్ చనిపోయినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేం అయిన తాము ఏడుస్తూ లోపలికి వెళ్లామని.. కానీ అక్కడ సీన్ చూసి ఏడుపు బంద్ చేశామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాత నిజాలన్నీ బయటకు కక్కి సంచలనం రేపారు. పాదయాత్రలో షర్మిల తనపై చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘తండ్రి అయిన వైఎస్ఆర్ చనిపోయినప్పుడు జగన్, షర్మిల, విజయమ్మలు ఏడుస్తున్నారనుకొని తాము లోపలికి వెళ్లామని.. తండ్రి చనిపోయిన బాధ ఎవరికైనా ఉంటుందని..కానీ వారు మాత్రం నెక్ట్స్ సీఎం ఎవరని రూంలో డిస్కస్ చేసుకుంటున్నారని’ జగ్గారెడ్డి బాంబు పేల్చారు.

వైఎస్ఆర్ చనిపోయిన బాధ తమకు ఉన్నంత కూడా వారికి లేదని.. తాము ఏడుస్తుంటే జగన్, షర్మిల,విజయమ్మలు తమనే ఓదార్చారని జగ్గారెడ్డి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. మేం వారిని ఓదార్చడానికి పోతే అక్కడ సీన్ చూసి తమకు ఏడుపు బంద్ అయ్యిందని జగ్గారెడ్డి అన్నారు.
తండ్రి శవం ఉండగానే రాజకీయాలు చేసిన షర్మిల నువ్వు నన్ను విమర్శించడం ఏంటని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి కూతురువి అని.. మా నాయకుడిపై గౌరవంతో నేను ఇన్నాళ్లు మౌనంగా ఉంటే నువ్వు రెచ్చిపోతున్నావంటూ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.
బీజేపీ వదిలిన బాణాలు షర్మిల, జగన్ లు అని.. ఆంధ్రా ఓటు బ్యాంకును చీల్చి ఏపీ, తెలంగాణలో బీజేపీకి లాభం చేకూర్చడానికే వీరిద్దరూ ప్రయత్నిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.
జగ్గారెడ్డి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఏపీ అంతా ఏడ్చింది. ఎమ్మెల్యేలు ఏడ్చేశారు. కానీ సొంత కుటుంబ సభ్యులైన జగన్, షర్మిల సీఎం కుర్చీ కోసం మతనాలు జరిపారన్న చేదు విషయాన్ని జగ్గారెడ్డి బయటపెట్టారు. అంతర్గతంగా జరిగిన ఈ విషయం ఇప్పటిదాకా బయటపడలేదు. కానీ షర్మిల నోటిదురుసుతో కౌంటర్ ఇవ్వాలి కాబట్టి జగ్గారెడ్డి ఇలా బాధలో నిజాలన్నీ కక్కేశారు. అదే ఇప్పుడు పెను సంచలనమై వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ ట్విస్ట్ అంటే ఫైర్ బ్రాండ్ అయినటువంటి జగ్గారెడ్డిని కెలికి దెబ్బైపోయింది కేవలం షర్మిల మాత్రమే కాదు.. అసలేం సంబంధం లేని ఏపీసీఎం జగన్ కూడా బుక్కయ్యాడు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఆ ఇంట్లో అసలేం జరిగిందన్నది ఇన్నాళ్లు వైఎస్ఆర్ పై అభిమానంతో నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరు తెరవలేదు. కానీ షర్మిల నోటిదురుసుకు ఇప్పుడు జగ్గారెడ్డి పూసగుచ్చినట్టు వివరించేశాడు. షర్మిల వల్ల ఆమె పరువే కాదు.. జగన్ పరువు కూడా తీసేసింది. వైఎస్ ఫ్యామిలీ ప్రతిష్టను షర్మిలనే దిగజార్చుకున్నట్టైంది.