Frustration: జగన్ ఫ్రస్టేషన్ పీక్స్.. ‘వెంకీ’ ఆసనం వేయాల్సిందేనా?

Jagan Frustration Peaks: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరిందా? అంటే అవుననమే సమాధానమే విన్పిస్తోంది. ఇన్నాళ్లు తనలోనే అణుచుకున్న అసహనాన్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి నంద్యాల సభలో వెళ్లగక్కినట్లు కన్పిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలను దొంగముఠాతో పోల్చడమే కాకుండా  ‘నా వెంట్రుక కూడా పీకలేరని’ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. ఈ మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష […]

Written By: NARESH, Updated On : April 9, 2022 9:29 am
Follow us on

Jagan Frustration Peaks: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరిందా? అంటే అవుననమే సమాధానమే విన్పిస్తోంది. ఇన్నాళ్లు తనలోనే అణుచుకున్న అసహనాన్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి నంద్యాల సభలో వెళ్లగక్కినట్లు కన్పిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలను దొంగముఠాతో పోల్చడమే కాకుండా  ‘నా వెంట్రుక కూడా పీకలేరని’ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

CM Jagan

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. ఈ మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల విమర్శలను గానీ, మీడియా కథనాలను గురించి బయట మాట్లాడింది పెద్దగా లేదు. కాకపోతే అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడం, విమర్శలకు గట్టిగా కౌంటర్ చేయడం కన్పించింది.

అసెంబ్లీలో వైసీపీ నేతల ధాటికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఏకంగా మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. దీనిని బట్టి అసెంబ్లీ వైసీపీ ఏ రేంజులో ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత విమర్శలకు అసెంబ్లీ వేదిక అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

మీడియా విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి ఇదే రీతిలో వ్యవహరిస్తుంటారు. జగన్ సీఎం అయ్యాక మీడియాతో నేరుగా సమావేశాలు నిర్వహించిన దాఖల్లాలేవనే చెప్పొచ్చు. మీడియా అంటే జగన్ కు బెరుకు లేకున్నప్పటీ వీటితో అనవసరమన్న భావనతోనే పూర్తి దూరం పెడుతూ వచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసే విమర్శలను సైతం ఆయన మంత్రులతోనే తిప్పి కొట్టించేవారు.

అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అవుతుండటం, జగన్మోహన్ రెడ్డికి ఇదే సీఎం లాస్ట్ ఛాన్స్ అని ప్రచారం చేయడం ఆయనను ఫ్రస్టేషన్ కు గురిచేసినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీని మరో శ్రీలంక అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, కొత్త క్యాబినెట్ కూర్పుతో తలబొట్టికట్టడం లాంటి సంఘటనతో విసిగిపోయిన జగన్మోహన్ రెడ్డి తనలోని మరో కోణాన్ని తాజాగా బయటపెట్టారు.

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆచితూచి మాట్లాడేవారు. సంయమనాన్ని కోల్పోకుండా పట్టుదలతో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా మూడేళ్ల పదవీ కాలం కూడా పూర్తి చేసుకొని కొన్ని వర్గాల్లో శభాష్ అనిపించుకున్నారు కూడా.

అయితే ఏమైందో ఏమోగానీ జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజులుగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈక్రమంలోనే గతంలోనే ఎన్నడూ లేనివిధంగా ఆయన ప్రతిపక్ష పార్టీలను దొంగ ముఠా అనడమే కాకుండా ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ వ్యాఖ్యానించడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావడమే జగన్ ఫ్రస్టేషన్ ను కారణమని తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ ‘వెంకీ’ ఆసనం వేయాల్సిందేననే కామెంట్స్ బలంగా విన్పిస్తున్నాయి.