Pakistan cricket : క్రికెట్‌లో అదో చికటి రోజు..

పాకిస్థాన్‌ ఇప్పటికీ చాలా ఎలైట్‌ అంతర్జాతీయ జట్లకు పరిమితులుగా ఉంది. 2009, మార్చిలో జరిగిన ఆ అదృష్ట రోజులో ఘటనల భయానకతను తొలగించడానికి సహాయపడింది.

Written By: Raj Shekar, Updated On : March 4, 2024 9:29 am
Follow us on

Pakistan cricket : క్రికెట్‌ చాలా చెడ్డ రోజులను చూసింది. అయితే వీటిలో చాలా వరకు పిచ్‌లోని ఘటనలకు సబంధం కలిగి ఉన్నాయి. 2009, మార్చి 3న పాకి స్థాన్‌లోని లాహోర్‌లో జరిగిన భయానక ఘటన క్రికెట్‌ పిచ్‌కు సంబంధం లేనిది. పాక్‌ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్‌ జట్టుపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనతో పాకిస్థాన్‌ 2011లో ప్రపంచకప్‌ నిర్వహించే అర్హత కోల్పోయింది. ఘటన జరిగి 15 ఏళ్లు దాటినా నాటి దృశ్యాలు క్రికెట్‌ అభిమానుల కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి.

ఏ జరిగిందంటే..
పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక, 2008లో ముంబై దాడుల తర్వాత భారత పర్యటనకు రాలేదు. 2009లో పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లింది. రెండో టెస్టు మూడో రోజు (2009, మార్చి 3న) లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంకు బయల్దేరారు. జట్టు సభ్యులు ఉన్న బస్సు లిబర్టీ స్వేర్‌ దాటుతుండగా, 12 మంది సాయుధులు బస్సుపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పాకిస్థాన్‌ భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపాయి. ఈ దాడిలో ఆరుగుకు పాకిస్తాన్‌ అధికారులు, ఇద్దరు పౌరులు మరణించారు.

ఏడుగురు క్రికెటర్లకు గాయాలు..
ఉగ్రదాడిలో శ్రీలంక జట్టుకోని ఏడుగురు క్రికెటర్లు గాయపడ్డారు. తిలన్, సమరవీర, కుమార సంగర్కర, తరంగ పరవితరన, అజంతా మెండీస్, చమిందా వాస్, మహేల జయవర్ధనే, సురంగ లక్మల్‌ ఉగ్రదాడిలో గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన సమరవీర, పరణవితాన ష్రాప్‌నెల్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. జట్టు అసిస్టెంట్‌కోచ్‌ పాల్‌ ఫార్ర్‌బేస్, రిజర్వు ఎంపైర్‌ అహ్సన్‌ రజా కూడా గాయపడ్డారు.

విమానంలో తరలింపు..
ఉగ్రదాడి తర్వాత అప్రమత్తమైన పాకిస్థాన్‌ ప్రభుత్వం శ్రీలంక జట్టును సైనిక విమానంలో తరలించాలని భావించింది. కానీ కొలంబోకు వెళ్లే విమానంలో వారిని తరలించారు. ఈ ఘటన గురించి సంగర్కర తన స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ లెక్చర్‌లో వివరించాడు. ‘నా చెవి నుంచి ఏదో చప్పుడు, సీటు వైపు బుల్లెట్‌ చప్పుడు, కొన్ని సెకన్ల ముందు నా తల ఉన్న కచ్చితమైన ప్రదేశం. నా భుజానికి ఏదో తగిలినట్లు అనిపిస్తుంది. అది తిమ్మిరి అయిపోతుంది. నాకు దెబ్బ తగిలిందని నాకు తెలుసు, కానీ నేను ఉపశమనం పొందాను మరియు తలపై దెబ్బ తగలకూడదని ప్రార్థిస్తున్నాను’ అని వివరించాడు.

పాకిస్థాన్‌పై విమర్శలు..
శ్రీలంక జట్టుపై ఉగ్రదాడితో పాకిస్థాన్‌ భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. పాకిస్థాన్‌ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఉగ్రవాద సంస్థ లష్కరే జాంగ్వీపై నిందలు మోపడంతో కొందరిని అరెస్ట్‌ చేశారు.

పాకిస్థాన్‌ బహిష్కరణ..
ఉగ్రదాడి ఘటనలో క్రికెట్‌ పరంగా పాకిస్థాన్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆరేళ్లపాటు పాకిస్థాన్‌లో ఎవరూ పర్యటించొద్దని నిర్ణయించారు. స్వదేశీ మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించాల్సి వచ్చింది.

పాకిస్థాన్‌ ఇప్పటికీ చాలా ఎలైట్‌ అంతర్జాతీయ జట్లకు పరిమితులుగా ఉంది. 2009, మార్చిలో జరిగిన ఆ అదృష్ట రోజులో ఘటనల భయానకతను తొలగించడానికి సహాయపడింది.