Ponguleti Srinivas Reddy : పొంగులేటిపై దాడులు : కాంగ్రెస్ ను కొట్టు.. బీఆర్ఎస్ తో బీజేపీ జట్టు!?

పొంగులేటి దాడుల వెనుక కేంద్రం ఉందా? బీజేపీ, బీఆర్ఎస్ లు ఉన్నాయా? అన్న దానిపై క్లారిటీ లేకున్నా.. దీని వెనుక ఖచ్చితంగా రాజకీయం ఉందని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి.

Written By: NARESH, Updated On : November 9, 2023 10:48 am
Follow us on

Ponguleti Srinivas Reddy :  పొంగులేటి.. తెలంగాణలో బడా కాంట్రాక్టర్.. బాగా డబ్బులున్న వ్యక్తి. ఆయన సామర్థ్యానికి మొత్తం ఖమ్మం జిల్లాను మెయింటేన్ చేయగలడు. ఖమ్మంలోని అందరు ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా ఆయనకుంది. అందుకే పొంగులేటి లాంటి బిగ్ షాట్ ను కొట్టాలంటే బీఆర్ఎస్ ఒక్కటి బలం సరిపోదు. అందుకే పరోక్షంగా బీజేపీ రంగంలోకి దిగినట్టు సమాచారం.

నిజానికి బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చడం.. కవితపై కేసులను హోల్డ్ చేశాకే.. బీఆర్ఎస్ తో బీజేపీ రాజీ పడిందన్న చర్చ బాగా సాగింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలం పూర్తిగా తగ్గిపోయింది. బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని అన్నీ సర్వేలు ఘోషిస్తున్నాయి.

అయితే కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవడానికే బీజేపీ సైలెంట్ అయ్యిందని.. కర్నాటకలోలాగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదనే బీఆర్ఎస్ గెలుపునకు పరోక్షంగా సహకారం అందిస్తోందన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో ఉన్నాయి.

ప్రత్యక్షమైనా.. పరోక్షమైనా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ చేతిలోకి పోకుండా బీఆర్ఎస్, బీజేపీలు అయితే చూసుకుంటున్నాయనే చెప్పొచ్చు. కాంగ్రెస్ గెలుస్తుందన్న అంచనాలే ఈ రెండు పార్టీలు అలెర్ట్ అవ్వడానికి కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతనే కాంగ్రెస్ ను గెలిపిస్తుంది.

అందుకే జాతీయ స్థాయిలో తమ పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా.. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేలా బీజేపీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు అత్యంత బలం ఉన్నా.. ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత పొంగులేటిపై ఐటీ, ఈడీ దాడుల వెనుక కారణం ఇదే అంటున్నారు. పొంగులేటి బీఆర్ఎస్ ను ఓడించి ఖమ్మం మొత్తం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను భుజానకెత్తుకున్నాడు. బడా కాంట్రాక్టర్ కావడంతో అంత డబ్బు ఆయన వద్ద ఉంది. అందుకే వ్యూహాత్మకంగానే పొంగులేటిని నియంత్రిస్తే కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవచ్చు. డబ్బుల పంపిణీని అరికట్టవచ్చు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ నజర్ చేశాయని.. కేంద్రం ఐటీ ఈడీ దాడుల వెనుక కారణం ఇదే అయ్యిండచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పొంగులేటి ప్రచారం కోసం బాగా ఖర్చు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈసీ కూడా పొంగులేటిపై నజర్ పెట్టి ఉండొచ్చని అంటున్నారు. పొంగులేటి దాడుల వెనుక కేంద్రం ఉందా? బీజేపీ, బీఆర్ఎస్ లు ఉన్నాయా? అన్న దానిపై క్లారిటీ లేకున్నా.. దీని వెనుక ఖచ్చితంగా రాజకీయం ఉందని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి.