Tilak Varma: ఆసియా కప్ లోకి తిలక్ వర్మ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీనా? కారణం ఇదే..

Tilak Varma: వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ తో ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో అరంగేట్రం చేసిన తెలుగు అబ్బాయి తిలక్ వర్మ ఐదు ఇన్నింగ్స్ లో తన సత్తా చాటాడు. ఆడిన ఐదు ఇన్నింగ్స్ లో 57.33 సగటుతో 173 పరుగులు సాధించడంతోపాటు ఒక హాఫ్ సెంచరీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బౌలింగ్ పరంగా ఒక వికెట్ తిలక్ అకౌంట్లో నమోదు అయింది. ఈ సిరీస్ లో మెరుగైన ప్రదర్శన కనబరచడమే కాకుండా […]

Written By: Suresh, Updated On : August 16, 2023 1:01 pm

Tilak Varma

Follow us on

Tilak Varma: వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ తో ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో అరంగేట్రం చేసిన తెలుగు అబ్బాయి తిలక్ వర్మ ఐదు ఇన్నింగ్స్ లో తన సత్తా చాటాడు. ఆడిన ఐదు ఇన్నింగ్స్ లో 57.33 సగటుతో 173 పరుగులు సాధించడంతోపాటు ఒక హాఫ్ సెంచరీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బౌలింగ్ పరంగా ఒక వికెట్ తిలక్ అకౌంట్లో నమోదు అయింది. ఈ సిరీస్ లో మెరుగైన ప్రదర్శన కనబరచడమే కాకుండా ఒత్తిడి తట్టుకొని ఆడడంతో ఈ ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌కు ఆసియా కప్ లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరో రెండు వారాలలో ప్రారంభం కాబోయే ఆసియా కప్ ఇండియన్ టీం మిడిల్ ఆర్డర్ లో తిలక్ బరిలోకి దిగవచ్చు. అంతేకాకుండా సిక్స్త్ బౌలర్ గా కూడా తిలక్ తన బౌలింగ్ టాలెంట్ చూపించే అవకాశం ఉంది. ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ క్రికెట్ కోసం ఇప్పటికీ బాంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి జట్లు తమ టీమ్స్ ను ప్రకటించాయి. అయితే ఇంకా బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం ఈ మ్యాచ్ లో పాల్గొనబోతున్న టీమ్ ఇండియా తుది జాబితాను అనౌన్స్ చేయలేదు.

ప్రస్తుతం టీమిండియాలో కొందరు ఆటగాళ్లు గాయాల సమస్యతో సతమతమవుతున్నారు. మరోపక్క వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో రీయంట్రీ ఇచ్చిన కొందరు నిలకడైన ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యారు. ఇంకా కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ల ఫిట్నెస్ టెస్ట్ రిపోర్ట్ రాలేదు. ఈ కారణాల వల్ల బీసీసీఐ సెలక్షన్ కమిటీ తుది టీం కోసం తర్జనభజన పడుతోంది. ఈ నేపథ్యంలో జరగబోయే ఆసియా కప్ కోసం సెలెక్ట్ చేసే టీమ్లో తిలక్ వర్మ కు చోటు దొరికే అవకాశం ఉంది అని చర్చ జోరుగా జరుగుతుంది.

దీనికి ప్రధానమైన కారణం ఈ హైదరాబాదీ దుమ్ము లేపే ప్రదర్శనే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్స్ కూడా విఫలమైనటువంటి పిచ్ పై తిలక్ వర్మ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ కూడా ఒంటరి పోరాటం చేశాడు. ప్రస్తుతం ఉన్న టీం ఇండియన్ మిడిల్ ఆర్డర్లో ఎడమ చేతి వాటం ఉన్న బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ లేడు. కాబట్టి తిలక్ వర్మ కు రిషబ్ ప్లేస్ లో టీం లో ప్లేస్ దొరికే ఆస్కారం ఉంది. అందుకే అందరూ ప్రస్తుతం తిలక్ కు ఆసియా కప్ లో పాల్గొనడానికి వైల్డ్ కార్డు ఎంట్రీ దొరికింది అని అభిప్రాయపడుతున్నారు.

ఇది కేవలం లక్ కొద్ది వచ్చిన అవకాశం అయితే కాదు. తిలక్ వర్మ ఎంతో మెరుగైన ప్రదర్శన కనబరిచి స్వశక్తితో తెచ్చుకున్న ఎంట్రీ. ప్రస్తుతం టీమిండియా మిడిల్ ఆర్డర్ ఉన్న పరిస్థితుల్లో తిలక్ వర్మ లాంటి ఆల్ రౌండర్ ఎంతో అవసరమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా టీం కి అవసరమైనప్పుడు నిలబడి ఆడగలిగే సత్తా తిలక్ వర్మకి ఉంది అని విండీస్ మ్యాచ్లలో నిరూపించుకున్నాడు. కాబట్టి అతనికి దక్కిన ఈ అవకాశం సరియైనదే అని అందరూ భావిస్తున్నారు.