IPL Auction 2023: ఐపీఎల్ నిర్వహణకు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందుకు గాను ఆటగాళ్లను కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ వేలంలో ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్నాయి. 11 ఫ్రాంచైజీలు తమకు పనికొచ్చే వారిని వేలంలో దక్కించుకున్నాయి. ఈ వేలంలో తమ జట్టుకు ఉపయోగపడే వారిని ఎంచుకుని మరీ ధర చెల్లించి మరీ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసుకున్నాయి. ఇక ఐపీఎల్ ఆటల్లో తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి.

ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. మినీ వేలంలో రూ.18.50 కోట్లు దక్కించుకుని రికార్డు నెలకొల్పాడు. తొలుత ముంబయి, బెంగుళూరు, పంజాబ్ పోటీపడినా చెన్నై కూడా తోడవడంతో అతడి వేలం ఒక్కసారిగా పెరిగింది. చివరకు పంజాబ్ అతడిని దక్కించుకుంది. ఇ్పటి వరకు ఐపీఎల్ వేలంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. షకీబ్ అల్ హసన్ రూ.1.50 కోట్ల ధర వద్ద ప్రారంభం కాగా ఎవరు ముందుకు రాకపోవడంతో అన్ సోల్డ్ గా మిగిలాడు.
కేన్ విలియమ్సన్ రూ. 2 కోట్లతో గుజరాత్ కొనుగోలు చేసింది. హ్యారీ బ్రూక్ రూ.13.25 కోట్లతో హైదరాబాద్, మయాంక్ అగర్వాల్ రూ.8.25 కోట్లతో హైదరాబాద్, అజింక్యా రహానె రూ.50 లక్షలు చెన్నై దక్కించుకుంది. జో రూట్, రిలీ రోసోలను ఎవరు తీసుకోకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారు. పంజాబ్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ను హైదరాబాద్, పంజాబ్, బెంగుళూరు కొనుగోలు చేయాలని పోటీ పడగా చివరకు హైదరాబాద్ సొంతం చేసుకుంది.

హ్యారీ బ్రూక్ ను సైతం రాజస్థాన్, బెంగుళూరు పోటీపడినా హైదరాబాద్ ఎగరేసుకుపోయింది. మొత్తానికి ఐపీఎల్ వేలంలో గమ్మత్తు విషయాలు చోటుచేసుకున్నాయి. తమ జట్టు కోసం మంచి వారిని తీసుకోవాలనే ఉద్దేశంతో ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఒక దశలో రూ.18 కోట్ల వరకు వెళ్లడం గమనార్హం. సత్తా గల ఆటగాళ్లు ఉంటే విజయాలు సొంతం అవుతాయనే ఆశతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీకి దిగాయి. ఇందులో సామ్ కరన్ కు పంజాబ్ జట్టు రూ.18.25 కోట్లు వెచ్చించడం చూస్తుంటే ఫ్రాంచైజీలు ఎంత ఉత్సాహం చూపించాయో అర్థమవుతోంది.