https://oktelugu.com/

లెప్ట్ హ్యాండ్ తో సత్తాచాటిన ప్రముఖులు వీరే..!

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. అని అక్కినేని నాగేశ్వర్ రావు ‘దేవదాసు’ సినిమాలో పాటపాడారు. అవునండీ.. కుడి ఎడమైతే పొరపాటు లేదని ప్రతీఒక్కరు తెలుసుకోవాలి. చిన్నతనంలో పిల్లలు ఎడమచేతితో పనులు చేస్తే చాలామంది అది కీడుగా భావిస్తుంటారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎడమచేతితో పనులు చేయకుండా శతవిధలా ప్రయత్నిస్తుంటారు. అయితే కుడిచేతిని ఉపయోగించే వారికంటే ఎడమచేతిని ఎక్కువ ఉపయోగించే వారే చాలా ప్రభావంతంగా ఉంటారని తేలింది. Also Read: భారత మీడియా ఫేక్ న్యూస్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 13, 2020 1:35 pm
    Follow us on


    కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. అని అక్కినేని నాగేశ్వర్ రావు ‘దేవదాసు’ సినిమాలో పాటపాడారు. అవునండీ.. కుడి ఎడమైతే పొరపాటు లేదని ప్రతీఒక్కరు తెలుసుకోవాలి. చిన్నతనంలో పిల్లలు ఎడమచేతితో పనులు చేస్తే చాలామంది అది కీడుగా భావిస్తుంటారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎడమచేతితో పనులు చేయకుండా శతవిధలా ప్రయత్నిస్తుంటారు. అయితే కుడిచేతిని ఉపయోగించే వారికంటే ఎడమచేతిని ఎక్కువ ఉపయోగించే వారే చాలా ప్రభావంతంగా ఉంటారని తేలింది.

    Also Read: భారత మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీనా?

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో 17శాతం లెప్ట్ హ్యాండర్స్ ఉన్నారని ఒక అంచనా. వీరికోసం ప్రత్యేకంగా లెప్ట్ హ్యాండర్స్ క్లబ్బులు కూడా ఉన్నాయి. డీన్ ఆర్ క్యాంప్ బెల్ అనే లెప్ట్ హ్యాండర్ 1976లో లెప్ట్ హ్యాండర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ను స్థాపించారు. ఆ తర్వాత 1977 ఆగస్టు 13 నుంచి లెప్ట్ హ్యాండర్స్ డేను ప్రతీయేటా అధికారికంగా నిర్వహిస్తున్నారు. లెప్ట్ హ్యాండ్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రతికూలతలపై అవగాహన పెంచేందుకు లెప్ట్ హ్యాండర్స్ డే ప్రతీయేటా నిర్వహిస్తున్నారు. చాలామంది లెప్ట్ హ్యాండర్స్ సోషల్ మీడియా ద్వారా తమ అనుభవాలను ఈరోజున పంచుకుంటున్నారు.

    ఇక ఎడమ చేతివాటం వారిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. అత్యున్నత పదవులు, మంచి విజయాలు సాధించడం ద్వారా వీరంతా కూడా ప్రజల్లో ఎడమ చేతివాటంపై ఉండే అపోహలను దూరం చేశారు. ఎడమచేతివాటం వారిలో రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, ఫిల్మ్ మేకర్లు, క్రీడాకారులు ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబమా కూడా ఎడమచేతివాటం వారే. ఇక మనదేశ ప్రధాని మోదీ కూడా ఎడమచేతివాటం వారేననే ఎంతమందికి తెలుసు..!

    Also Read: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతి మహిళ

    ఇక క్రికెట్లో సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, జయసూర్య, క్రిస్ గేల్, గౌతమ్ గంభీర్ తదితరులు ఎడమచేతితో మెరుపులు మెరిపించారు. సినిమా రంగంలో ప్రఖ్యాత కామెడియన్ చార్లీ చాప్టిన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మహానటి సావిత్రి, మైకేల్ జాక్సన్, సోనాక్షి సిన్హా వంటి ప్రముఖులు ఉన్నారు. అయితే ఎడమచేతివాటం వారిలో ఆడవారి కంటే మగవారే ఎక్కువగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. వైద్యశాస్త్ర ప్రకారంగా పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు ఎడమ, కుడి అనేది నిర్ధారణ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎడమ చేతిని ఉపయోగించే వారిలో సృజనాత్మక కూడా ఎక్కువనే తేలిందట. ఈ కారణంగా తల్లిదండ్రులు పిల్లలు ఎడమ చేతివాటం వాళ్లు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.