Director James Cameron: అతడు పుట్టింది కెనడాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో. తండ్రి ఇంజనీర్.. తల్లి ఓ గృహిణి. తనలాగే తన కొడుకుని ఇంజనీర్ చేయాలని ఆ తండ్రి అనుకున్నాడు.. కానీ ఆ కొడుకుకు చదువు అబ్బ లేదు. కానీ ఫిజిక్స్, ల్యాబ్ లో ప్రయోగాలు బాగా నచ్చేవి.. అందుకోసమే పాఠశాలకు వెళ్లేవాడు.. అంతేకాదు, అతడి తల్లి కథలు బాగా చెప్పేది.. ఆమె ద్వారానే పుస్తకాలు చదివేందుకు అలవాటు పడ్డాడు. క్రమంగా సైన్స్ ఫిక్షన్ కథల మీద ఆసక్తి పెంచుకున్నాడు.. ఇప్పుడు ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. అతడే జేమ్స్ కామెరూన్.

ఇంజనీర్ ను చేయాలి అనుకున్నాడు
జేమ్స్ కామెరూన్ తండ్రి అతడిని తనలాగే ఇంజనీర్ చేద్దాం అనుకున్నాడు. అతడి హై స్కూల్ చదువు పూర్తయ్యాక స్తోమతకు మించిపోయినప్పటికీ ఒక మంచి కాలేజీలో చేర్పించాడు.. కానీ చదువు, ఉద్యోగంపై ఆసక్తి లేకపోవడంతో కామెరూన్ మధ్యలోనే మానేశాడు. తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు టాక్సీ డ్రైవర్ గా అవతారం ఎత్తాడు. కామెరూన్ ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేయడం ఆమెకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆ పని మానేయమని ఆమె బతిమిలాడుతూ ఉండేది.. కానీ అతడు వినేవాడు కాదు.
మలుపు తిప్పింది ఇక్కడే
చిన్నప్పుడు తన తల్లి చెప్పిన కథలను కామెరూన్ కవితలు, కథల మాదిరిగా రాసుకునేవాడు. తనకు ఏదైనా ఆలోచన వస్తే వెంటనే ట్రక్ ఆపి రాసుకునేవాడు.. మిగతా డ్రైవర్లు అతన్ని వింతగా చూసేవారు.. ఇతడికి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకునేవారు. అయితే 1977లో “స్టార్ వార్స్” ప్రాంచైజీ సినిమాలు చూసిన తర్వాత అతడికి అలాంటి సినిమాలు తీయాలని ఆలోచన వచ్చింది.. తన లక్ష్యం ఏమిటో ఒక స్పష్టత వచ్చింది.. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలి అనుకున్నాడు. కామెరూన్ అనుకున్నంత ఈజీగా అతడి సినిమా ప్రయాణం మొదలు కాలేదు. దాదాపు రెండు సంవత్సరాలు కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరకు ఒక ప్రొడక్షన్ సంస్థలో పనిచేసే అవకాశం వచ్చింది.. కానీ అతడు పది రోజులు పని చేయగానే ఆ నిర్మాతలు మరొకరికి అవకాశం ఇచ్చారు.
తనెంటో నిరూపించుకున్నాడు
తనను తొలగించిన తర్వాత కామెరూన్ సంస్థను వదలలేదు.. ఆ సినిమాను ఎలా తీస్తున్నారో అక్కడే ప్రొడక్షన్ అసిస్టెంట్ గా ఉండి గమనించాడు.. అనుకోకుండా ఆ నిర్మాతలు ఫిరానా_2 కు ప్లాన్ చేశారు. కొంతకాలానికి ఆ సినిమాకు ముందు అనుకున్న దర్శకుడు తాను ఆ పని చేయలేనని చెప్పడంతో… నిర్మాణ సంస్థ ఆ బాధ్యతను కామెరూన్ చేతిలో పెట్టింది.. దీంతో వచ్చిన అవకాశాన్ని కామెరూన్ సద్వినియోగం చేసుకున్నాడు.. ప్రాణం పెట్టి ఆ సినిమా తీశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మిగతా నిర్మాణ సంస్థలు కామెరూన్ ను నమ్మడం మొదలుపెట్టాయి.
ఫుడ్ పాయిజన్ తర్వాత..
ఫిరానా సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత అతడు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డాడు. ఒకరోజు పడుకుని ఉండగా ఇన్విజబుల్ రోబో తన పై దాడి చేసినట్టు పీడకల వచ్చింది. దిగ్గున లేచి కలలో గుర్తుతెచ్చుకొని కామెరూన్ రోబో కథాంశంతో కథ రాసుకొని సినిమా తీశాడు. అదే ది టెర్మినేటర్. ఆ సినిమా కామెరూన్ జీవితాన్ని మార్చింది. ఈత, వాటర్ స్పోర్ట్స్, సాహసాలు అంటే కామెరూన్ కు చాలా ఇష్టం.. జియోగ్రఫీ ఛానల్ కోసం కొన్ని డాక్యుమెంటరీలు కూడా తీశాడు. అవి తీస్తున్నప్పుడే “టైటానిక్” సినిమా తీయాలని ఆలోచన వచ్చింది.. షూటింగ్ కు ముందు టైటానిక్ షిప్ చూసేందుకు అట్లాంటిక్ మహాసముద్రం దిగువకు అనేకసార్లు డైవ్ చేశాడు..షిప్ ను చూస్తూనే డైలాగులు కూడా ఆలోచించుకునేవాడు.. కామెరున్ షూటింగ్ సమయంలో నటీనటుల పట్ల దూకుడుగా ఉండేవారు. దీంతో చాలామంది నటీనటులు ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఇష్టపడేవారు కాదు. టైటానిక్ సినిమాలో నటించిన కేన్ విన్స్లెట్ అతని ముఖం మీద నీ సినిమాలో నటించినని చెప్పింది.
1999 లోనే..
వాస్తవానికి అవతార్ సినిమా కథలను కామెరూన్ 1999లోనే సిద్ధం చేసుకున్నాడు.. డబ్బులు, సాంకేతిక పరిజ్ఞాన పరంగా ఇబ్బందులు తలెత్తడంతో కాస్త విరామం తీసుకున్నాడు. చాలా ప్రొడక్షన్ హౌస్ లకు అవతార్ కథ నచ్చినప్పటికీ ఖర్చుకు వెనుకాడేవారు.. దీంతో కామెరూన్ ఆస్తులు అమ్ముకొని, అప్పులు చేసి సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి అవతార్ సినిమా తీశాడు.. ప్రపంచానికి తాను ఏంటో నిరూపించుకున్నాడు.. ఈ సినిమాకు సంబంధించిన సంభాషణలు కారులోనే రాసుకున్నాడు. ఇక చిన్నతనం నుంచి కామెరూన్ జంతు ప్రేమికుడు.. అందుకే మాంసాహారం ముట్టడు.. చివరకు పాలు కూడా తాగడు.. సినీ రంగంలోకి వచ్చాకా మొక్కల ఆధారిత మాంసం, చీజ్, డెయిరీ ఉత్పత్తులు తయారు చేయాలని ఒక స్టార్టప్ నూ మొదలు పెట్టాడు.

హిందుత్వం అంటే అభిమానం
కామెరూన్ కు హిందుత్వం అంటే అభిమానం. ఆ సంస్కృతికి సంబంధించిన దేవుళ్లను విపరీతంగా ఆరాధిస్తాడు.. అందుకే ఈ సినిమా పేరును కూడా సంస్కృతం నుంచి తీసుకున్నాడు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, శివుడి పాత్రలే ఆయన కథలకు స్ఫూర్తి.. ప్రస్తుతం వాటి నుంచి ప్రేరణ పొందే అవతార్ సీరిస్ లో సినిమాలు తీశాడు. ఆ విషయాన్ని అతడు బాహటంగానే చెప్పాడు.. కానీ కొందరు దీనిపై నొచ్చుకున్నారు. కానీ అతడు వెనకడుగు వేయలేదు. అది అతడి తెగువ. ఆ తెగువే ఇప్పుడు ఆయనను ప్రపంచ మేటి దర్శకుడిని చేసింది.. ఇక శుక్రవారం విడుదల కాబోతున్న అవతార్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.