Prince Mukarram Jah: ముకర్రం జా.. ఎనిమిదో నిజాం.. ప్రిన్స్ ముకర్రం జా బహుదూర్ షా గా గుర్తింపు పొందాడు. టర్కీ లోని ఇస్తాంబుల్ లో శనివారం మృతి చెందాడు.. హైదరాబాదులోని చారిత్రక మక్కా మసీదులోని ఆయన తండ్రి ఆజం జా సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహించాలనే అతడి చివరి కోరిక మేరకు ప్రభుత్వం అలానే చేసింది.. ఇతడి చరిత్ర ఒకసారి తవ్వితే… భారతదేశంలో విలీనం అయ్యేంతవరకు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడే ముకర్రం జా.. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం రాజభరణాలను రద్దు చేసే వరకు ఎనిమిదవ నిజాం నవాబుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందారు.. నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ కు ఇద్దరు కుమారులు ఉండగా… ఇద్దరి పైనా ఆయనకు విశ్వాసం లేకపోవడంతో పెద్దకొడుకు కుమారుడైన ముకర్రం జా ను 1954లో తన వారసుడిగా ప్రకటించారు.. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. అయితే ముకర్రం జా 1977లో అత్యయిక స్థితి సమయంలో సంజయ్ గాంధీతో వివాదం కారణంగా ఆస్ట్రేలియా వెళ్లారు.. తర్వాత టర్కీ కి వెళ్లి జీవితం మొత్తం అక్కడే గడిపారు.

ముకర్రం జా 1933 అక్టోబర్ 6న ఆజం జా, దర్రు షేహవార్( టర్కీ చివరి రాజు కుమార్తె) దంపతులకు జన్మించారు.. తన తల్లి ద్వారా జోర్డాన్, సౌదీ అరేబియా రాజ కుటుంబాలతో బంధుత్వం కలిగిన ముకర్రం… డూన్ స్కూల్, కేం బ్రిడ్జి విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ తో పాటు విశ్వవిఖ్యాత రాయల్ మిలిటరీ అకాడమీలో విద్యను అభ్యసించారు. ముకర్రం ఐదుగురిని వివాహమాడారు.. తొలుత ముకర్రం నివాసం బంజారాహిల్స్ లో 400 ఎకరాల్లో ప్రస్తుతం కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్కుగా ఉన్న చిరాన్ ప్యాలెస్ లో ఉండేది. కానీ, దక్షిణ టర్కీలోని ఆయన మధ్యధర సముద్ర తీరంలో రెండు గదుల ఫ్లాట్లో ఉండేవారు.

లండన్ లో బారిష్టర్ గా విద్యాభ్యాసం చేసిన ముకర్రం కు విమానయానం లోనూ ప్రవేశం ఉంది.. ఆయన రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ లతో కలిసి విమానయానం చేశారని, విమానాల్లో సాంకేతిక లోపం వచ్చినప్పుడు మెకానిక్ గా కూడా లోపాలను సరిదిద్దారని ఆయన వంశీయులు చెబుతున్నారు. ముకర్రం ఆస్ట్రేలియా వెళ్ళకముందు ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో సంబంధాలు కొనసాగించారని, ఆర్థికంగా ఎంతో వృద్ధి సాధించారని తెలుస్తోంది.. 1967లో రాష్ట్ర గవర్నర్ గా అవకాశం వచ్చినప్పటికీ తిరస్కరించారని తెలుస్తోంది.. 1979 వరకు దేశంలోనే అపర కుబేరుడిలా ఉన్న ముకర్రం… ఆ తర్వాత తన డబ్బును ట్రస్టులకు, దానధర్మాలకు ఎక్కువగా వినియోగించారని తెలుస్తోంది.

చివరి దశలో ఆయన వద్ద హైదరాబాద్, ఆస్ట్రేలియా, టర్కీ లో ఉన్న ప్యాలెస్ లు, స్థిరాస్తులు మాత్రమే మిగిలాయి.. ముకర్రం కుమారుడు అజ్మ త్ ను తొమ్మిదవ నిజాం గా ప్రకటించారు.. చివరిగా ముకర్రం 2005లో నగరానికి వచ్చారు.