AP New Cabinet: సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ ను మరోసారి పునర్వవ్యస్థికరించనున్నారు. ఏప్రిల్ 11న ఏపీ క్యాబినెట్ మరోసారి కొలువుదీరబోతున్న సంగతి అందరికీ తెల్సిందే. ఈక్రమంలోనే మంత్రి వర్గంలోకి ఎవరెవరు కొత్తగా వస్తారు? పాతవారిలో ఎవరికీ జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇస్తారనే చర్చ ఏపీలో హాట్ హాట్ గా నడుస్తోంది.

మిషన్ 2024 పేరుతో రాబోతున్న ఏపీ కొత్త క్యాబినేట్ పై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అనేక రాజకీయ, కుల సమీకరణాలు, వినయ, విధేయతలు, అనుభవం తదితర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఏపీ కొత్త క్యాబినేట్ కూర్పు ఉండబోతుంది. అయితే మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి డేట్ దగ్గరపడుతున్న కొద్ది క్యాబినేట్ కూర్పు అనేది రసవత్తరంగా మారుతోంది.
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులంతా ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే వీరిలో ఎక్కువ మంది మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇంకొందరు అసమ్మతి గళం, అలక పాన్పులెక్కడం వంటివి చేస్తున్నారు. ఇక గతంలో మంత్రి పదవీ మిస్ అయిన వారంతా ఈసారి ఎలాగైనా క్యాబినేట్లో బెర్త్ ఖరారు చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండటంతో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పాతవారికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కన్పిస్తోంది. సుమారు ఏడు నుంచి పది మంది కొత్త వారికి రెండోసారి దక్కబోతుందని సమాచారం. దీంతో ఈసారి ఆశావహులకు జగన్మోహన్ రెడ్డి మొండిచేయి చూపించే అవకాశం కన్పిస్తోంది.
వైసీపీలో బడా పొలిటీషయన్ గా గుర్తింపు దక్కించుకున్న పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి, ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి వీరభక్తుడు కొడాలి నానికి మరోసారి ఛాన్స్ దక్కే అవకాశం కన్పిస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు సైతం వెల్లడించారు.
పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లేకుంటే తమ పార్టీ లేదన్నారు. ఈ ముగ్గురు లేని క్యాబినేట్ ను తాను ఊహించలేనని చెప్పుకొచ్చారు. ఒకవేళ బోత్సను తప్పిస్తే ఆయన తమ్ముడు బొత్స అప్పల నర్సయ్యకు పదవీ దక్కే అవకాశం కన్పిస్తోంది. పెద్ది రెడ్డిని కాదని రోజాకు జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇస్తారా? అనేది ప్రశ్నగా మారింది.
క్యాబినెట్లో చోటు కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇవేమీ పట్టించుకోకుండా ప్రత్యర్థి పార్టీలపై ఒంటరిగానే విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఏదిఏమైనా ఈ సాయంత్రానికి జగన్ కొత్త క్యాబినేట్ లిస్టు ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
[…] AP Cabinet Reshuffle: కొత్త మంత్రుల తుది జాబితా సిద్ధమైంది. సుదీర్ఘ కసరత్తు తరువాత సీఎం జగన్ ఖరారు చేశారు. ముందు అనుకున్నట్టే పాత..కొత్త కలయికగా నూతన మంత్రివర్గం ఉంటుంది. ఒకరిద్దరు పాత మంత్రులను మాత్రమే కొనసాగిస్తామన్న మాట తప్పారు. సీనియర్ల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఇలా ఫైనల్ చేసిన జాబితాలో పేర్లు ఉన్న వారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. దీంతో మంత్రులుగా ఎంపిక చేసిన వారి ఇంట వద్ద అనుచరులు, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా వర్గ విభేదాలు అధికమున్నచోట, గత మూడేళ్లుగా వివక్షకు గురైన వారు మంత్రులుగా ఎంపికైన నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్టేషన్ తో నేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. […]
[…] Property Tax AP: ఆంధ్రప్రదేశ్ లో పన్నుల భారం ఎక్కువవుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ధరాభారం, మరోవైపు పెట్రో ధరలు, ఇంకో వైపు విద్యుత్ చార్జీల మోతలు పెరుగుతుంటే ప్రస్తుతం ఆస్తిపన్ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతిపక్షాలు మండిపడుతున్నా సర్కారు మాత్రం లెక్కచేయడం లేదు. దీంతో ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లోని ప్రజలపై దాదాపు రూ. 214 కోట్ల భారం పడుతోందని తెలుస్తోంది. […]