Megastar Chiranjeevi: పద్మ విభూషణ చిరంజీవ : చిరు ‘స్వయం కృషి ‘ కి దక్కిన పురస్కారం…

ఎంత మంది పోటీ ఉన్న వాళ్లందరితో పోరాడాడు చివరికి మెగాస్టార్ గా ఎదిగాడు...ఆయన పడిన కష్టం, ఆయన కోల్పోయిన సంతోషాలు,ఆయన పడిన అవమానాలు అన్ని కలిపి అతన్ని ఇండస్ట్రీలోనే ఒక గొప్ప నటుడిగా తీర్చిదిద్దాయి...

Written By: Gopi, Updated On : January 26, 2024 9:33 am
Follow us on

Megastar Chiranjeevi: పట్టుదల, పోరాడే తత్వం ఉంటే ఒక సామాన్యుడు సైతం శిఖరాగ్ర స్థానాన్ని అధిరోహించవచ్చు అనే ఒక గొప్ప పాఠాన్ని యావత్తు భారతదేశ ప్రేక్షకులకి తెలియజేసిన ఒకే ఒక నటుడు చిరంజీవి…ఆయన కెరియర్ లో ఆయన చేయని పాత్ర లేదు, ఆయన చూడని సక్సెస్ లేదు, ఆయన కొట్టని రికార్డ్ లేదు, ఆయన సాధించని సక్సెస్ లేదు…’కాలం తలపై తన శకాన్ని సంతకం లా మార్చుకున్న నటుడు చిరంజీవి’…

ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు రాజ్యమేలుతున్న సమయం లో ఏ తోడు లేకుండా, ఎవరి అండ అవసరం లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, కష్టాన్ని నమ్ముకొని సాధించాలి అనే దృఢ సంకల్పంతో ఇండస్ట్రీకి వచ్చి మొదట చిన్న, చిన్న వేషాలను వేసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ, అప్పుడున్న స్టార్ హీరోలు సైతం ఔరా అనేలా తన డాన్సులు, ఫైటింగ్ లతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఒకే ఒక్కడు కొణిదల శివ శంకర వర ప్రసాద్ అలియాస్ చిరంజీవి….ఆయన ప్రస్థానం లో ఎన్నో ఆటంకాలు వచ్చిన ఎదిరించాడు,ఎంత మంది పోటీ ఉన్న వాళ్లందరితో పోరాడాడు చివరికి మెగాస్టార్ గా ఎదిగాడు…ఆయన పడిన కష్టం, ఆయన కోల్పోయిన సంతోషాలు,ఆయన పడిన అవమానాలు అన్ని కలిపి అతన్ని ఇండస్ట్రీలోనే ఒక గొప్ప నటుడిగా తీర్చిదిద్దాయి…

మనలో చాలామంది ‘నటన లో కమల్ హాసన్ తోపు, స్టైల్ లో రజనీకాంత్ కింగ్ అని అనుకుంటూ ఉంటాం’.కానీ ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ అయిన కే బాలచందర్ మాత్రం కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరినీ కలిపితేనే ఒక్క చిరంజీవి అవుతాడు’ అని చిరంజీవి గురించి చాలా గొప్పగా చెప్పడం అప్పట్లో పెను సంచలనాన్ని రేపింది. ఎక్కడో మొగల్తూరులో పుట్టిన చిరంజీవి దేశ ఒక గొప్ప నటుడిగా తన పేరుని సువర్ణ అక్షరాలతో లిఖించుకోవడం వెనక ఎన్నో ఆటు పోట్లు ఉన్నాయి, ఎన్నో చిదరింపులకు గురి అయ్యాడు, మొత్తనికైతె చీకొట్టిన వాళ్లతోనే జై కొట్టించుకున్నాడు, అవమానించిన వాళ్ల ముందే గెలిచి నిలిచి చూపించాడు. అలాగే ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని చిరంజీవి అయ్యాడు. మొదట ‘పునాది రాళ్ళు’, ‘ప్రాణం ఖరీదు’ లాంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలను వేసిన చిరంజీవి ‘ఖైదీ’ సినిమాతో తన నటనలోని సామర్థ్యాన్ని ప్రేక్షకులకు చూపించి స్టార్ హీరో గా ఎదిగాడు.మొదట ‘సుప్రీం హీరో ‘ గా ఉన్న చిరంజీవి ఆ తర్వాత వరుసగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్లు కొట్టి మెగాస్టార్ అయ్యాడు.

ఇక ఆయన కెరియర్ లో ఖైదీ,అత్తకు యముడు అమ్మాయికి మొగుడు,జగదేక వీరుడు అతిలోక సుందరి, యముడికి మొగుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, హిట్లర్, మాస్టర్, చూడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్, ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహ రెడ్డి,వాల్తేరు వీరయ్య లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు.ఇక ఇప్పుడు వచ్చే యంగ్ స్టర్స్ ఎంతోమంది చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయనలా కష్టపడి ఆయనలా ఎదగాలి అనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి వస్తున్నారు. అలా వచ్చి సక్సెస్ అయిన హీరోలు కూడా చాలా మంది ఉన్నారు.ఇక ఇది ఇలా ఉంటే 2000 వ సంవత్సరంలో ప్రముఖ ఫోబ్స్ మ్యాగజైన్ చిరంజీవి ని ఉద్దేశించి ‘బిగ్గర్ దన్ బచ్చన్’ అంటూ ఒక ఆర్టికల్ ని రాసింది. అప్పుడు తెలిసింది ఇండియా లోనే నెంబర్ వన్ హీరో చిరంజీవి అని…

కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పటికైనా నిలబడతాడు కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పటికైనా ఇండస్ట్రీ లో నిలబడతాడు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్ పుల్ ని సెట్ చేసిన ఒకే ఒక్కడు చిరంజీవి. ఇక ఆయన నటనతోనే కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టీ ఎంతో మందికి ప్రాణం పోశారు.ఇక ప్రస్తుతం ఆయనకి దేశంలోనే ‘2 వ అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ రావడం’ అనేది ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ పురస్కారాన్ని అందుకున్న రెండవ తెలుగు నటుడిగా చిరంజీవి చరిత్రలో నిలిచాడు. ఆయనకి ఇండస్ట్రీ అంటే ఎంత పిచ్చి అంటే రాజకీయ పార్టీ పెట్టి ఒక పది సంవత్సరాలు సినిమాలకి దూరమైనప్పటికీ సినిమాని వదిలిపెట్టి అక్కడ వుండలేక మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఇప్పుడు కూడా ఎక్కడ తగ్గకుండా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్న, కొత్త స్టార్ హీరోలు వచ్చిన కూడా ఇప్పటికి, ఎప్పటికి చిరంజీవి మాత్రం ఒక్కడే ఉంటాడు.ఆయన నటనని క్రాస్ చేసి నటుడు గానీ, తన గ్రేస్ ని టచ్ చేసే హీరోగాని ఇంకా పుట్టలేదనే చెప్పాలి…