https://oktelugu.com/

Snake Yoga: భయపెట్టించే స్నేక్ యోగా.. దీంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సాధారణ యోగా చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో.. ఈ స్నేక్ యోగా చేయడం వల్ల కూడా అంతే ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ స్నేక్ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మరి చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 23, 2024 / 04:28 AM IST

    Snake Yoga

    Follow us on

    Snake Yoga: యోగా ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ప్రతీ ఒక్కరూ కూడా చేస్తుంటారు. అయితే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో విషయాలు ట్రెండ్ అవుతున్నాయి. కొత్త కొత్త విషయాలు వీటి ద్వారా ప్రజలకు తెలుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో ఓ కొత్త యోగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సాధారణంగా పాములు అంటే అందరికీ భయం ఉంటుంది. వీటిని చూస్తూ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. ఎందుకంటే చూడటానికి భయంకరంగా ఉండే ఈ పాముల్లో విషం ఉంటుంది. ఇవి మనిషిని తినేస్తాయి. అయితే ఇంత భయపెట్టించే పాములతో ఓ యువతి యోగా చేస్తోంది. అసలు పాములతో యోగా ఏంటి భయ్యా.. అని అనుకోవద్దు. మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఈ స్నేక్ యోగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పామును చూడటానికే భయపడతారు.. అలాంటి చేతితో పట్టుకుని యోగా చేస్తున్నారు. సాధారణ యోగా చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో.. ఈ స్నేక్ యోగా చేయడం వల్ల కూడా అంతే ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ స్నేక్ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మరి చూద్దాం.

    సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న వాటిలో స్నేక్ యోగా ఒకటి. ఇది స్నేక్ యోగాను రోజూ చేయడం వల్ల చేతులు, కండరాలు దృఢంగా తయారవుతాయి. అలాగే ఇవి కీళ్ల సమస్యలను కూడా తగ్గిస్తాయి. బాగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఈ స్నేక్ యోగాను చేయడం వల్ల విముక్తి కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ స్నేక్ యోగా వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ స్నేక్ యోగాతో యంగ్ లుక్‌లో కూడా కనిపించవచ్చని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శ్వాసను నియంత్రించడం, శ్వాసకోశ పనితీరును మెరుగుపరచడంలో ఈ స్నేక్ యోగా బాగా సహాయపడుతుంది. అలాగే రక్తపోటును తగ్గించడంతో పాటు రక్త ప్రసరణను మెరుపరుస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

    ఈ స్నేక్ యోగా చేసేటప్పుడు పాము కాటు వేస్తే విషం శరీరంలోకి ప్రవేశిస్తుందని కొందరు అనుకుంటారు. అయితే విషం లేని పాములతో ఈ స్నేక్ యోగా చేస్తారని నిపుణులు అంటున్నారు. వీటితో చేయడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఈ యోగాను ఎక్కువగా అమెరికాలోకి కాలిఫోర్నియాలో చేస్తారు. అయితే ఈ స్నేక్ యోగా సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పాములతో ఇలా యోగా చేయడంతో వారిపై విమర్శలు వస్తున్నాయి. పాములతో ఇలా చేయడం వాటిని హింసించినట్లే అవుతుందని మండిపడుతున్నారు. ఇలా వాటితో చేయడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరగవచ్చని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.