
Earthquake Fear In India: ఉత్తరాఖాండ్… ఈ పేరు చెబితే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హిమాలయ పర్వతాలు, జలపాతాలు… గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్… ప్రకృతి రమణీయతకు, హిమగిరులు అద్దిన సొబగులకు ఉత్తరాఖండ్ పెట్టింది పేరు.. అలాంటి ఈ రాష్ట్రం ఇప్పుడు ప్రమాదం అంచున నిలబడింది. రేపటి నాడు ఏం జరుగుతుందో తెలియక కుంగిపోతోంది.
జోషి మఠం ఘటన ఏం చెబుతోంది?
కొద్ది నెలల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జోషి మఠం ప్రాంతంలో పగుళ్లు ఏర్పడ్డాయి. చాలా ఇళ్ళు కుంగిపోయాయి. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు నెలకొల్పిన ఈ మఠం ఇలా కుంగిపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. కొందరైతే తమ ఇళ్ళను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. వాస్తవానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇల్లు కుంగిపోవడం అనేది రెండేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే ఇందుకు కారణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా అభివృద్ధి పనులు చేపట్టడమే. పైగా ఇక్కడ విద్యుత్ ప్రాజెక్టులు కూడా నిర్మిస్తున్నారు. అడ్డగోలుగా రోడ్లు నిర్మిస్తున్నారు. చెట్లను నరికేస్తున్నారు. దీనివల్ల సున్నితమైన హిమాలయ పర్వతాలకు సంబంధించిన వాతావరణం దెబ్బతింటున్నది. ఇది అంతిమంగా భూ పటలంలో మార్పులకు కారణమవుతోంది.
తీవ్రమైన పర్యవసనాలు
గత ఏడాది చార్ దామ్ యాత్ర ప్రారంభమైనప్పుడు చాలామంది చనిపోయారు. కానీ ఈసారి ఇంకా యాత్ర ప్రారంభమే కాలేదు. అప్పటికే రోడ్లు పగుళ్లు ఇస్తున్నాయి. పలుచోట్ల భూమి కంపిస్తోంది. రిక్టర్ స్కేల్ పై పెద్దగా ప్రమాదం నమోదు కానప్పటికీ… భవిష్యత్తు తలుచుకొని ఉత్తరాఖండ్ వాసులు వణికిపోతున్నారు. సిరియాలో భూకంపం వచ్చిన కొద్ది రోజులకే కర్ణ మార్గంలో ఇళ్ళు కుంగిపోవడం గమనార్హం.. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విచ్చలవిడిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మానేయాలని కోరుతున్నారు. మరోవైపు ఈసారి చార్ ధామ్ యాత్రకు భారీగా యాత్రికులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ వారంతా వస్తే ఆ ఒత్తిడిని ఈ రోడ్డు భరించగలదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భూమిగా పేరు గడించిన ఉత్తరఖాండ్ మరు భూమిగా మారుతుందా అనే భయాందోళనలు కూడా ఇక్కడి ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరాఖండ్ లోనే పరిస్థితి అలా ఉంటే ఇక దేశ రాజధాని ఢిల్లీలో భూమి కనిపించింది. ఢిల్లీలోని పలుచోట్ల భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై ఇది 3.6 గా నమోదయింది. కాగా భూమి పొరల్లో ఒత్తిడి పెరిగి ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.. మరోవైపు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోనూ భూమి కనిపించింది. చెన్నైలోని మౌంట్ రోడ్డు, వైట్ రోడ్లో భూమి పంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.. అండర్ గ్రౌండ్ మెట్రో పనుల వల్లే ప్రకంపనలు జరిగాయని స్థానికులు చెబుతుండగా.. దానిని మెట్రో నిర్మాణ సంస్థ కొట్టి పారేసింది.