https://oktelugu.com/

తక్కువ ధరకే జియో ల్యాప్ టాప్ లు.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..?

జియో రాకతో దేశీయ టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. తక్కువ ధరకే వాయిస్, డేటా కాల్స్ ను అందిస్తున్న జియో అతి తక్కువ ధరకే వాట్సాప్, ఫేస్ బుక్ యాప్ లతో కూడిన ఫీచర్ ఫోన్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. త్వరలో జియో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. Also Read: నెలకు రూ.3,300 కడితే అదిరిపోయే బైక్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 5, 2021 4:08 pm
    Follow us on

    JIO Low Cost Laptop.

    జియో రాకతో దేశీయ టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. తక్కువ ధరకే వాయిస్, డేటా కాల్స్ ను అందిస్తున్న జియో అతి తక్కువ ధరకే వాట్సాప్, ఫేస్ బుక్ యాప్ లతో కూడిన ఫీచర్ ఫోన్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. త్వరలో జియో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

    Also Read: నెలకు రూ.3,300 కడితే అదిరిపోయే బైక్ మీ సొంతం.. ఎలా అంటే..?

    త్వరలో జియో తక్కువ ధరకే ల్యాప్ టాప్ లను కూడా మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఈ ల్యాప్ టాప్ లకు సంబంధించిన పనులు కీలక దశకు చేరుకున్నాయని.. జియో బుక్ పేరుతో జియో సంస్థ ఈ ల్యాప్ టాప్ లను మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఈ ఏడాది మే నెల నాటికి జియో ల్యాప్ టాప్ లు మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ ల్యాప్ టాప్ లు గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో పని చేయనున్నాయని తెలుస్తోంది.

    Also Read: వాహనదారులకు శుభవార్త.. ఆన్ లైన్ లోనే ఆర్‌టీవో సేవలు..!

    ఆండ్రాయిడ్ ఓఎస్ లో కీలక మార్పులు చేసి మార్కెట్ లో ఉన్న ల్యాప్ టాప్ లతో పోలిస్తే తక్కువ ధరకే జియో ఈ ల్యాప్ టాప్ లను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలుస్తోంది. క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ తో ఈ ల్యాప్ టాప్ పని చేయనుందని సమాచారం. ఈ ల్యాప్ టాప్ లో ఇన్ బిల్ట్ 4జీ ఎల్టీఈ మోడెమ్ ఉంటుందని.. 11 నానోమీటర్ టెక్నాలజీతో ఈ ల్యాప్ టాప్ పని చేయనుందని తెలుస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    అయితే ల్యాప్ టాప్ కు సంబంధించి జియో నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ల్యాప్ టాప్ లో జియోకు సంబంధించిన కొన్ని సర్వీసులను ముందే లోడ్ చేసి ఉంచుతారని.. త్వరలో జియో నుంచి ఈ ల్యాప్ టాప్ కు సంబంధించి పూర్తి వివరాలతో ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.