https://oktelugu.com/

మమతా బెనర్జీ సంచలనం..తొడగొట్టింది.. 291మందితో బరిలోకి..

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తొడగొట్టారు. ఒకేసారి 291మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. 50, 100 అభ్యర్థుల చొప్పున రిలీజ్ చేయకుండా బెంగాల్ వ్యాప్తంగా అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగారు. ఇక ఇన్నాళ్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీచేసి గెలిచి సీఎంగా పాలిస్తున్నారు. ఇటీవల బీజేపీతో ఫైట్ దృష్ట్యా వారి సవాల్ ను స్వీకరిస్తూ ఏకంగా వివాదాస్పద పోరాటాల గడ్డ నందిగ్రామ్ నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 5, 2021 3:33 pm
    Follow us on


    బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తొడగొట్టారు. ఒకేసారి 291మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. 50, 100 అభ్యర్థుల చొప్పున రిలీజ్ చేయకుండా బెంగాల్ వ్యాప్తంగా అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగారు.

    ఇక ఇన్నాళ్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీచేసి గెలిచి సీఎంగా పాలిస్తున్నారు. ఇటీవల బీజేపీతో ఫైట్ దృష్ట్యా వారి సవాల్ ను స్వీకరిస్తూ ఏకంగా వివాదాస్పద పోరాటాల గడ్డ నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగడం సంచలనమైంది. నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగి బీజేపీకి మమతా సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని తొడగొట్టారు.

    బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294సీట్లు ఉండగా 291 స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను ఖరారు చేసి ఒకేసారి భారీ జాబితాను ప్రకటించారు. మిగతా మూడు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు.

    ఇకరెండు స్థానాల నుంచి మమతా బెనర్జీ పోటీచేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఈసారి నందిగ్రామ్ నుంచి బరిలో దిగాలని మమత నిర్ణయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక మమత మీద తృణమూల్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్ నుంచే పోటీచేస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

    మమతా బెనర్జీ ఈసారి వృద్ధులకు టికెట్లు నిరాకరించారు. ఇక మహిళలకు 50 సీట్లు, 42 ముస్లింలకు, 79 ఎస్సీలు, 17మంది ఎస్టీలకు టికెట్లు ఇచ్చి బలహీన వర్గాలకే టికెట్లు ఇచ్చారు. బెంగాల్ లో తొలి విడత ఎన్నికలు ఈనెల 27న జరుగనున్నాయి. ఏప్రిల్ 29న ఎనిమిదో విడత ఉంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.