సాధారణంగా మనలో చాలామంది పెట్రోల్ అంటే ఒకే రకం ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ పెట్రోల్ లో కూడా వేర్వేరు రకాల పెట్రోల్ లు ఉంటాయి. తాజాగా ఇండియన్ ఆయిల్ కొత్తరకం పెట్రోల్ ను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్‌పీ100 పెట్రోల్ పేరుతో పిలిచే ఈ వరల్డ్ క్లాస్ ప్రీమియం పెట్రోల్ వల్ల వాహనదారులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా ఈ పెట్రోల్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది.
Also Read: ఫోన్ చేయకుండా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే ఛాన్స్.. ఎలా అంటే..?
అయితే ఇండియన్ ఆయిల్ ప్రస్తుతం దేశంలోని ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఎక్స్‌పీ100 పెట్రోల్ ను అందుబాటులోకి తెచ్చింది. చాలా తక్కువ దేశాల్లో మాత్రమే ప్రస్తుతం వాహనదారులకు ఎక్స్‌పీ100 పెట్రోల్ అందుబాటులో ఉంది. భారత్ లో కూడా ఈ పెట్రోల్ అందుబాటులోకి రావడం వల్ల మరో అరుదైన ఘనత భారత్ సొంతమైంది. ప్రపంచ దేశాల్లో కేవలం ఆరు దేశాలు మాత్రమే ఈ పెట్రోల్ ను వినియోగిస్తున్నాయి.
Also Read: రిస్క్ లేకుండా డబ్బు రెట్టింపు చేసే ఛాన్స్.. ఎలా అంటే..?
లీటర్ 140 రూపాయలకు పైగా పలికే ఈ కొత్తరకం పెట్రోల్ వాహనాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రీమియం బైక్స్, లగ్జరీ కార్లలో ఈ రకం పెట్రోల్ ను ఎక్కువగా వినియోగిస్తారు. ఈ పెట్రోల్ వాడిన వాహనాల ఇంజన్ సాధారణ వాహనాలతో పోల్చి చూస్తే ఎక్కువ కాలం మన్నిక ఇస్తుంది. అందువల్ల చాలామంది ఎక్స్‌పీ100 పెట్రోల్ ను వాహనాలలో వినియోగించడానికి ఆసక్తి చూపుతుంటారు.
మరిన్ని వార్తలు కోసం: జనరల్
వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడే ఈ కొత్తరకం పెట్రోల్ త్వరలో హైదరాబాద్ వాసులకు ఇండియన్ పెట్రోల్ బంకులలో అందుబాటులోకి రానుంది. ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని బట్టి ఈ పెట్రోల్ ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి.