India Vs South Africa 1st Test: ఇండియా సౌతాఫ్రికా తో ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో సౌతాఫ్రికా టీమ్ ఒక మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యం లో కొనసాగుతున్నారు…ఇక ఈ మ్యాచ్ కి ప్రధాన కారణం రెండో ఇన్నింగ్స్ లో ఇండియన్ టీం 131 పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం అనేది ఇండియన్ టీం ఓటమికి ప్రధాన కారణంగా మారింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినప్పటికీ తనకి సహకారం అందించే ఏ ఒక్క ప్లేయర్ కూడా క్రీజ్ లో లేకపోవడంతో ఇండియా 32 పరుగులతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
రోహిత్ శర్మ , అశ్విన్, బుమ్రా ముగ్గురు డక్ అవుట్ అవ్వడంతో కోహ్లీకి సహకారం అందించే బ్యాట్స్ మెన్ కరువయ్యాడు. రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు కూడా చాలా తొందరగా ఔట్ అయ్యారు అలాగే ఇండియన్ టీం ఓటమికి ప్రధాన కారణం అయ్యారు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్ లో 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడంతో ఇండియన్ టీం ని ఓటమి నుంచి తప్పించలేకపోయారు.. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికన్ బౌలర్లు అయిన బర్గర్ 4, జాన్సన్ 3,రబడా 2 వికెట్లు తీశారు.
ఇండియన్ టీమ్ ఇంత వరస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి ఇంత భారీ ఓటమికి దారి తీయడంతో ఇండియన్ టీమ్ పరిస్థితి ఇలా అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఇండియన్ టీం అభిమానులు అందరూ భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారు.ఇక ఇది చూసిన అభిమానులు ఇండియన్ టీమ్ ఇలా ఆడితే డబ్ల్యూటీసి ఫైనల్ కి అర్హత సాధించడం చాలా కష్టమవుతుంది. ఇక ఇప్పటికీ రెండు సార్లు డబ్ల్యూటీసి ఫైనల్ కి వెళ్లి ఇండియన్ టీం రన్నరప్ గా నిలిచింది.
ఇక ఈసారైనా డబ్ల్యూటీసి ఫైనల్ కి వెళ్లి కప్పు కొడుతుందేమో అనుకుంటున్న సందర్భంలో ఇలా ఇండియన్ టీం సౌతాఫ్రికా మ్యాచ్ లో ఓడిపోవడానికి చూస్తుంటే టీంలో ప్లేయర్లు మధ్య కోఆర్డినేషన్ సరిగా కుదరనట్టుగా కనిపిస్తుంది…మరి సెకండ్ మ్యాచ్ లో అయిన అందరూ సమిష్టిగా రానించి ఆ మ్యాచ్ ని గెలిచి సీరీస్ ని సమం చేయాలని కోరుకుందాం…