https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగాలు..?

భారత ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన ఇండియన్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 19 ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తులను కోరుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.indbankonline.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. Also Read: రైతులకు కేంద్రం షాక్.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 9, 2021 4:39 pm
    Follow us on

    Indbank

    భారత ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన ఇండియన్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 19 ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తులను కోరుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.indbankonline.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: రైతులకు కేంద్రం షాక్.. వారికి పీఎం కిసాన్ డబ్బులు రావు..!

    మొత్తం 19 ఖాళీలలో మ‌ర్చెంట్ బ్యాంక‌ర్‌, రిసెర్చ్ అన‌లిస్ట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సీఏ లేదా ఎంబీఏ(ఫైనాన్స్‌) పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉండి మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిసెర్చ్ అన‌లిస్ట్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండి కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: కేంద్రం కొత్త నిబంధనలు.. వారానికి నాలుగు రోజులే పని..?

    సిస్ట‌మ్ ఆఫీస‌ర్‌ ఉద్యోగాల కొరకు పీజీ, గ్రాడ్యుయేషన్, డీఓఈఏసీసీ ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండి కనీసం సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఓ ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండి కనీసం సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరానికి రూ.2.5 ల‌క్ష‌ల నుంచి రూ.8 ల‌క్ష‌ల వ‌ర‌కు ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతనం లభిస్తుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.