IND vs SA Review : సౌతాఫ్రికా తో ఆడే మూడో టి 20 మ్యాచ్ రివ్యూ..

మ్యాచ్ గెలవడానికి సౌతాఫ్రికా భారీ సన్నాహాలను చేస్తూ బరిలోకి దిగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కి కూడా వర్షం అడ్డంకి గా మారే అవకాశం అయితే ఉంది.

Written By: NARESH, Updated On : December 14, 2023 10:41 am
Follow us on

IND vs SA Review : ఇండియా సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టి 20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణం గా రద్దయింది. ఇక రెండో టి20 మ్యాచ్ లో సౌతాఫ్రికా ఇండియాను ఢీ కొట్టి మ్యాచ్ ని విజయం సాధించింది.ఇక వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఈ మ్యచ్ లో సౌతాఫ్రికా జట్టు విజయం సాధించినట్టుగా ను పరిగనించారు. అయితే ఇండియా టీం లో ప్లేయర్లు కొంతవరకు తడబడ్డారు.అయితే ఏ ప్లేయర్ ఎలా ఆడుతున్నాడు అనేది తెలుసుకొని బిసిసిఐ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మూడో టి20 మ్యాచ్ కోసం జట్లులో కొన్ని కీలక మార్పులు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సిరీస్ గెలవడం ఓడిపోవడం అనేది పక్కన పెడితే వచ్చే సంవత్సరం జూన్ లో వెస్టిండీస్ అమెరికా ల్లో జరిగే టి 20 వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీం ను రెడీ చేయడానికి బీసీసీఐ ప్రయత్నం చేస్తుంది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కి వెళ్లి ఇండియన్ టీం భారీ ఓటమిని చవిచూసింది. దాంతో ఇక మీదట అలాంటి పరిస్థితి రిపీట్ అవ్వకూడదనే ఉద్దేశ్యం తోనే టీంలో బెస్ట్ కాంబినేషన్ సెట్ చేయడానికి బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ప్రతి ప్లేయర్ ని కూడా పరీక్షించే ప్రయత్నం అయితే చేస్తుంది…

మ్యాచ్ గెలవడానికి సౌతాఫ్రికా భారీ సన్నాహాలను చేస్తూ బరిలోకి దిగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కి కూడా వర్షం అడ్డంకి గా మారే అవకాశం అయితే ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం మొదట బౌలింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంది.జొహానెస్‌బర్గ్ లో ఇప్పటివరకు ఇండియా 10 మ్యాచ్ లను ఆడితే అందులో 5-5 తో సమానం చేసింది. ఇక ఈ పిచ్ ఇండియన్ టీంకు కూడా బాగా అనుకూలిస్తుంది.ముఖ్యంగా ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్ అవడం వల్ల పరుగులు కూడా ధారాళంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధిస్తే సీరీస్ సమం అవుతుంది. లేకపోతే సౌతాఫ్రికా సిరీస్ ని సొంతం చేసుకుంటుంది.ఇక ఇండియన్ టీమ్ బ్యాట్స్ మెన్స్ లలో కొంతమంది మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ మరి కొంత మంది మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతున్నారు.

ఇక బౌలర్ల విషయానికి వస్తే సిరాజ్, ముకేశ్ కుమార్ లాంటి పేసర్లు విపరీతంగా పరుగులు ఇస్తున్నారు. అందుకే వాళ్ళకంటూ ఒక మంచి పర్ఫామెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశ్యం తోనే బీసీసీఐ వాళ్లకు వరుసగా చాన్స్ లు ఇస్తుంది. ఇప్పుడు ఏది చేసిన బిసిసిఐ టి20 వరల్డ్ కప్ కోసమే చేస్తుంది కాబట్టి ప్లేయర్లు కూడా దాని అర్థం చేసుకొని వాళ్ళ ఆట తీరును మెరుగుపరుచు కుంటున్నట్టు గా తెలుస్తుంది….

అలాగే ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ లేదా యశస్వి జైశ్వాల్ ఇద్దరిలో ఒకరి మీద వేటు పడే అవకాశం ఉంది. అలాగే తిలక్ వర్మ ప్లేస్ లో శ్రేయాస్ అయ్యర్ టీమ్ లోకి వస్తాడు.ఇక జితేష్ శర్మ ప్లేస్ లో ఇషాన్ కిషన్ వస్తాడు…