https://oktelugu.com/

Chicken: చికెన్‌లో ఈ పార్ట్ తింటున్నారా.. అంతే సంగతులు ఇక

చికెన్‌లోని కొన్ని పార్ట్‌లను తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా చికెన్‌లోని ఆ పార్ట్‌ను తినకూడదని, తింటే తప్పకుండా దీర్ఘకాలిక సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు. మరి చికెన్‌లో తినకూడని ఆ పార్ట్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 23, 2024 / 02:08 AM IST

    Chicken

    Follow us on

    Chicken: కొందరికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. వెజ్ ఫుడ్ కంటే నాన్‌ వెజ్‌కే ఎక్కువ ఇష్టం చూపిస్తారు. వెజ్ కర్రీలు అయితే పొద్దున్న వండిన కూర మళ్లీ వండితే.. రోజూ ఇదేనా అని తినడం మానేస్తారు. అదే నాన్ వెజ్‌ను రోజూ పెట్టినా బోర్ కొట్టదు. కొందరైతే చికెన్ కోసం గొడవలు కూడా పెట్టుకుంటారు. మూడు పూటలు పెట్టిన నాన్ వెజ్ తింటారు. అయితే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా మాత్రమే తినాలి. ఇందులోని ప్రొటీన్ ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుంది. బరువు పెరగడానికి బాగా సాయపడుతుంది. అయితే చికెన్‌లో కొందరికి మెత్తని పీస్‌లు అంటే ఇష్టం. మరికొందరికి గట్టిగా ఉండే దుమ్ములు అంటే ఇష్టం ఉంటుంది. అయితే చికెన్‌లోని కొన్ని పార్ట్‌లను తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా చికెన్‌లోని ఆ పార్ట్‌ను తినకూడదని, తింటే తప్పకుండా దీర్ఘకాలిక సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు. మరి చికెన్‌లో తినకూడని ఆ పార్ట్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

    చికెన్‌ను కొందరు చర్మం తీసి వండుతారు. కానీ మరికొందరు చర్మం తీయకుండా వండుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల చర్మం సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చికెన్ మెడ భాగాన్ని అసలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కోడి మెడలో విషపూరిత క్రిములు ఉంటాయి. ఇవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే ఈ రోజుల్లో చాలా మంది బాయిలర్ కోళ్లను మాత్రమే తింటున్నారు. కానీ వీటి కంటే నాటు కోడి ఆరోగ్యానికి మంచిది. నాటు కోడి తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చికెన్ తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్ట్స్ అసలు తినవద్దు.

    సాధారణంగా చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అధికంగా తినకూడదు. మోతాదులో మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా తినడం వల్ల రక్తపోటు ఎక్కువ కావడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే కొందరికి తెలియక చికెన్‌తో కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు వంటివి తాగుతుంటారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. చికెన్‌తో ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల గ్యాస్, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే ప్రమాద ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల శరీరంలో కూడా విషపూరిత రసాయనాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.