https://oktelugu.com/

5, 10 రూపాయల కాయిన్స్ ఉన్నాయా.. లక్షలు వస్తాయంటూ మోసాలు..?

ఈ మధ్య కాలంలో పాత నోట్లు, పాత కాయిన్లు లక్షల రూపాయలకు కొనుగోలు చేస్తామంటూ కొన్ని ప్రకటనలు తెగ వైరల్ అవుతున్నాయి. చాలామంది ఈ ప్రకటనలను నిజమేనని నమ్ముతున్నారు. ఇలాంటి ప్రకటనలు నమ్మితే లక్షల రూపాయలు రావడం కంటే అకౌంట్ లో ఉన్న డబ్బులు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అమాయకులు ఎక్కువగా ఈ తరహా మోసాల బారిన పడి మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో కొత్తతరహా మోసం వెలుగులోకి వచ్చింది. అమాయకుల అమాయకత్వంను ఆసరాగా చేసుకొని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 9, 2021 / 08:21 PM IST
    Follow us on

    ఈ మధ్య కాలంలో పాత నోట్లు, పాత కాయిన్లు లక్షల రూపాయలకు కొనుగోలు చేస్తామంటూ కొన్ని ప్రకటనలు తెగ వైరల్ అవుతున్నాయి. చాలామంది ఈ ప్రకటనలను నిజమేనని నమ్ముతున్నారు. ఇలాంటి ప్రకటనలు నమ్మితే లక్షల రూపాయలు రావడం కంటే అకౌంట్ లో ఉన్న డబ్బులు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అమాయకులు ఎక్కువగా ఈ తరహా మోసాల బారిన పడి మోసపోతున్నారు.

    తాజాగా హైదరాబాద్ నగరంలో కొత్తతరహా మోసం వెలుగులోకి వచ్చింది. అమాయకుల అమాయకత్వంను ఆసరాగా చేసుకొని సైబర్ మోసగాళ్లు మోసాలకు తెరలేపారు. పాత కరెన్సీ నాణేలు ఇస్తే లక్షల రూపాయలు ఇస్తామంటూ ప్రచారం చేసి అందినంత మొత్తం దోచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తికి దేవతల బొమ్మలు ఉన్న నాణేలు ఇస్తే లక్షల్లో ఇస్తామని సందేశాలు పంపుతున్నారు.

    5 రూపాయల నాణెం ఉంటే 5 లక్షల రూపాయలు, 10 రూపాయల నాణెం ఉంటే 10 లక్షల రూపాయలు ఇస్తామంటూ ప్రకటన చేశారు. 5 రూపాయల నాణెం ఉన్న ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. సైబర్ మోసగాళ్లు ఆ వ్యక్తికి నగదు బదిలీ చేయడానికి ముందుగా పన్ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. సైబర్ మోసగాళ్ల మాటలు నమ్మిన వ్యక్తి వాళ్లకు 39వేల రూపాయలు చెల్లించాడు.

    డబ్బులు చెల్లించిన తరువాత సైబర్ మోసగాళ్ల ఫోన్ స్విఛాఫ్ రావడంతో డబ్బులు చెల్లించిన వ్యక్తికి అనుమానం కలిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు