Homeఆంధ్రప్రదేశ్‌AP And Telangana BJP: బీజేపీ ఏపీ, తెలంగాణ కొత్త అధ్యక్షులు వీరే.. సాయంత్రం అధికారిక...

AP And Telangana BJP: బీజేపీ ఏపీ, తెలంగాణ కొత్త అధ్యక్షులు వీరే.. సాయంత్రం అధికారిక ప్రకటన!?

AP And Telangana BJP: తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్పులకు బీజేపీ హైకమాండ్‌ శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తుంది. అటు ఏపీ ఇటు తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షులు రాబోతున్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కార్యదర్శిగా ఈటల రాజేందర్, ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పురందేశ్వరి నియమితులయ్యారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. ఈమేకు సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. కాగా, ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నారు.

సంజయ్, కిషన్‌రెడ్డి.. ఇద్దరూ సుముఖంగా లేరు..
అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ వైదొలగడానికి సుముఖంగా లేరని..అలాగే కిషన్‌రెడ్డి మళ్లీ రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి ససేమిరా అంటున్నట్టు తెలుస్తుంది. అయితే హైకమాండ్‌ ఆదేశిస్తే మాత్రం ఈ మార్పులు అమలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తుల అభిప్రాయం కంటే పార్టీ ప్రయోజనాల కోసం అధిష్టానం ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండగా.. ఆయనను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలనే భావనలో ఉన్నట్టు తెలుస్తుంది.

నడ్డాతో సంజయ్‌ భేటీ..
ఇక ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్న బండి సంజయ్‌ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరమని.. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని బండికి నడ్డా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఢిల్లీలో మీ అవసరాలను వాడుకుంటామని జేపీ నడ్డా హామీ ఇచ్చారని సమాచారం.

‘బండి’పై అసంతృప్తి..
ఇదిలా ఉండగా తెలంగాణలో బండి సంజయ్‌ నాయకత్వంపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. అధ్యక్షుడిని మార్చాలని ఎప్పటి నుంచో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మూడేళ్ల పదవీ కాలం ముగిసినందున మార్చడమే మంచిదని అధిష్టానం కూడా భావించింది. అదే సమయంలో కిషన్‌రెడ్డి వివాదరహితునిగా పేరుంది. దీనితో కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని హైకమాండ్‌ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఏపీలో సోము వీర్రాజు పదవీ కాలం ముగుస్తుంది. అలాగే ఆయన ప్రజల్లోకి వెళ్లలేదనే భావన ఉంది. ఇక దీనిపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జేపీ.నడ్డా ఫోన్‌ చేసి చెప్పారని.. అలాగే కొత్త బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version