మనలో చాలామంది బంధువులు, స్నేహితులకు అవసరమైతే బైక్ లేదా కారును ఇస్తూ ఉంటాం. బైక్ లేదా కారు ఇచ్చే సమయంలో అవతలి వ్యక్తికి లైసెన్స్ ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయము. అయితే ఇకపై అలా లైసెన్స్ లేకపోయినా వాహనం ఇస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. వాహనం తీసుకుని ఇతరులు డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడితే మాత్రం పోలీసులు వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తారు.
Also Read: ఆ వ్యక్తి ఆచూకీ చెబితే లక్ష రూపాయలు.. అతనెవరంటే..?
వాహన యజమానులు లైసెన్స్ లేని వాళ్లకు వాహనం ఇస్తే గరిష్టంగా 5 వేల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో మోటార్ వెహికిల్ యాక్ట్ 19 కింద పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్ల పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారుల విషయంలో కఠిన చర్యలు చేపడుతున్నారు.
Also Read: ఇంటి నుంచే ఆధార్ అప్ డేట్ చేసుకునే ఛాన్స్.. ఎలా అంటే..?
డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి లైసెన్స్ లేని పక్షంలో చిక్కిన వారిని ఫస్ట్ రెస్పాండెంట్ గా, వాహన యజమానిని సెకండ్ రెస్పాండెంట్ గా పేర్కొని ఛార్జిషీట్ ను ఫైల్ చేస్తారు. ఫస్ట్ రెస్పాండెంట్ 10,000 రూపాయలు జరిమానా చెల్లించడంతో పాటు ఒకరోజు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. సెకండ్ రెస్పాండెంట్ 5 వేల రూపాయల జరిమానా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ 30 శాతం కంటే ఎక్కువ ఉంటే పోలీసులు వాహనాన్ని సీజ్ చేస్తారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ 100 శాతం దాటితే 15 వేల రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.