https://oktelugu.com/

ఈ ఆంజనేయుడిని గురువారం పూజిస్తే..?

ఎంతో ధైర్యశాలి, బలవంతుడు అయిన హనుమంతుని వివిధ రూపాలలో పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆంజనేయస్వామికి ఎక్కువగా శని, మంగళవారాల్లో విశేష పూజలను నిర్వహిస్తుంటారు. అదే విధంగా మనం చేసే ఏ కార్యాలలో ఎలాంటి ఆటంకం లేకుండా మానసిక ధైర్యం కలగాలంటే గురువారం పూట ఆంజనేయ స్వామి ని పూజించడం ద్వారా అనుకున్న కార్యాల్లో విజయం సాధించవచ్చు. పురాణాల ప్రకారం ఆంజనేయుడు శివుని అంశం అని చెబుతారు. అలాగే వివిధ రూపాలలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 4, 2021 / 12:22 PM IST
    Follow us on

    ఎంతో ధైర్యశాలి, బలవంతుడు అయిన హనుమంతుని వివిధ రూపాలలో పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆంజనేయస్వామికి ఎక్కువగా శని, మంగళవారాల్లో విశేష పూజలను నిర్వహిస్తుంటారు. అదే విధంగా మనం చేసే ఏ కార్యాలలో ఎలాంటి ఆటంకం లేకుండా మానసిక ధైర్యం కలగాలంటే గురువారం పూట ఆంజనేయ స్వామి ని పూజించడం ద్వారా అనుకున్న కార్యాల్లో విజయం సాధించవచ్చు. పురాణాల ప్రకారం ఆంజనేయుడు శివుని అంశం అని చెబుతారు. అలాగే వివిధ రూపాలలో ఆంజనేయస్వామిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

    Also Read: శుభకార్యాలలో కంకణం ఎందుకు కట్టుకుంటారో తెలుసా..?

    ఆంజనేయ స్వామిని వివిధ రూపాలలో పూజించడం మనం చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలోనే వీరాంజనేయ రూపంలో స్వామివారిని పూజించడం వల్ల ధైర్యం ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఎటువంటి తాంత్రిక ఇబ్బందులతో బాధపడే వారు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా తాంత్రిక బాధలు తొలగిపోతాయి. యోగ ఆంజనేయస్వామిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత మనోధైర్యం చేకూరుతుంది.

    Also Read: ఆ ప్రాంతంలో కళ్లు తెరిచిన శివలింగం.. పూజారి ఏమన్నారంటే..?

    అదేవిధంగా భక్త ఆంజనేయ స్వామిని గురువారం పూజించడం వల్ల మనం చేసే కార్యాలలో ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. అదేవిధంగా సంజీవి ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సకల వ్యాధులు తొలగిపోతాయి. ఈ విధంగా వివిధ రూపాలలో ఆ ఆంజనేయుడిని పూజించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అయితే స్వామివారిని ఎక్కువగా తమలపాకులు, సింధూరంతో పూజించడంవల్ల స్వామివారు ప్రీతి చెంది మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా పూజా సమయంలో స్వామివారికి ఎర్రటి పుష్పాలను సమర్పించి పూజ చేయాలి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం