Janasena in Telangana : జనసేన తెలంగాణలో పోటీ చేసి ఆంధ్రాలో అవకాశాల్ని దెబ్బ తీసుకుంటుందా?

జనసేన తెలంగాణలో పోటీ చేసి ఆంధ్రాలో అవకాశాల్ని దెబ్బ తీసుకుంటుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : November 4, 2023 3:49 pm

Janasena in Telangana : తెలంగాణలో జనసేన పోటీ.. అదీ బీజేపీతో కలిసి చేస్తోంది. ఇది ఒకింత ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే జనసేనకు అసలు అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసే సత్తా ఉందా? అన్నది అందరికీ డౌటు. పవన్ కళ్యాణ్ మూడో రాజకీయ శక్తిగా ఆంధ్రాలో ఎదగాలన్నది మా కోరిక. తెలంగాణలో ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకున్నాడు.. దీనికి కారణం క్యాడర్ ఒత్తిడికి పవన్ తలొగ్గాడు. అందుకే పోటీ చేస్తున్నాడు.

బీజేపీతో జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుంటుందన్నది ఇక్కడ అందరినీ ఆలోచింపచేస్తోంది. జనసేన అంతకుముందే 32 నియోజకవర్గాల్లో పోటీకి ప్రకటించింది. అయితే బీజేపీతో పొత్తు తర్వాత పరస్పరం కలిసి పోటీచేయాలని నిర్ణయించారు. దీనికి బీజేపీ కూడా ఓకే చెప్పడంతో తెలంగాణలో జనసేన పోటీకి లైన్ క్లియర్ అయ్యింది.

తెలంగాణలో క్షేత్రస్థాయిలో జనసేనకు ఎటువంటి కమిటీలు లేవు. నేతలు లేరు. అలాంటిది ఎలా పోటీచేస్తారన్నది జనసేన ఆలోచించాలి. అయితే జనసేన తెలంగాణలో పోటీ చేసి ఆంధ్రాలో అవకాశాల్ని దెబ్బ తీసుకుంటుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.