Revanth Reddy-Asaduddin Owaisi : నిన్నటి మెట్రో కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ కొత్త బంధం చూసిన వారికి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. అధికార కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు, అధికార పక్షాలు పాల్గొనడం సహజమే అయినా.. రేవంత్, ఓవైసీల చర్యలు మాత్రం వారి బంధానికి కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డిని ఓ బద్ద వ్యవహారంలా ఓవైసీ చూసేవారు. రేవంత్ మొదట ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని.. బీజేపీ మూలాలు ఉన్నాయని.. ఆ పద్ధతిలో విమర్శించిన వ్యక్తి ఓవైసీ..
అలాంటి ఓవైసీ నిన్న మాట్లాడిన మాటలు చూస్తే.. ఆశ్చర్యం వేస్తుంది. రేవంత్ రెడ్డి అంత గట్టి వాడు లేదు..మొండి వాడు లేడు. తను అనుకున్నది సాధించుకోగలడు.. ఐదేళ్లు ఆయన అధికారానికి ఢోకా లేదు.. ఓవైసీ మాటలు టోటల్ విరుద్ధంగా ఉన్నాయి.
మజ్లిస్ చరిత్ర చూస్తే.. ఎప్పుడూ కూడా ఎవరు అధికారంలో ఉంటే వారితో అంటకాగడమే వారి పని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ , టీడీపీ ఎవరు అధికారంలో ఉన్నవారితో అంటకాగుతుంది. తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా అందరినీ ఆశ్చర్యపరిచాయి. కాంగ్రెస్ నేతలంతా మజ్లిస్ ను తిడుతుంటే.. ఓవైసీపై రేవంత్ పొగడ్తల వర్షం కురిపించడం అందరికీ షాక్ ఇచ్చాయి. ఓవైసీని ఓడించడం సాధ్యం కాదన్న సంకేతాలు ఇచ్చారు.
రేవంత్ రెడ్డి – ఒవైసీల బంధం కొత్త సమీకరణాలకు తెరలేస్తుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.