Hyper aadi : బుల్లితెరపై హైపర్ ఆది ఒక సెన్సేషన్. జబర్దస్త్ వేదికగా హైపర్ ఆది ఏళ్ల తరబడి నవ్వులు పూయించాడు. హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. హైపర్ ఆది నాన్ స్టాప్ పంచులు హాస్యప్రియులకు గిలిగింతలు పెట్టేవి. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ చేయడం లేదు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ రియాలిటీ షోలలో మాత్రమే కనిపిస్తున్నాడు. కాగా హైపర్ ఆది జబర్దస్త్ లోకి ఒక టీమ్ మెంబర్ గా వచ్చాడు.
అదిరే అభి టీమ్ లో హైపర్ ఆది చేశాడు. హైపర్ ఆది రాసే స్కిట్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అదిరే అభి టీమ్ కి మంచి పేరొచ్చింది. స్కిట్స్ రాసేది తానే కావడంతో తనకు మంచి రోల్స్, పంచ్ డైలాగ్స్ రాసుకునేవాడు హైపర్ ఆది. దాంతో త్వరగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం టీమ్ లీడర్ అయ్యాడు. టీం లీడర్ అయ్యాక తనను ఆపడం ఎవరి తరం కాలేదు. అదిరే అభి టీమ్ లో హైపర్ ఆది కంటే ముందు నుంచే రాము అనే కమెడియన్ ఉండేవాడు. అతనికి మాత్రం ఎలాంటి ఫేమ్ రాలేదు. అప్పుడప్పుడు ఇదే విషయమై రాము మీద హైపర్ ఆది పంచులు వేస్తూ ఉండేవాడు.
అయితే కష్టాల్లో తనను ఆదుకుంది రామునే అని తాజాగా బయటపెట్టాడు హైపర్ ఆది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి రాము రాగా… అతన్ని ఉద్దేసించి హైపర్ ఆది మాట్లాడాడు. తాను జబర్దస్త్ కమెడియన్ గా ఎదగడంలో అదిరే అభి పాత్ర ఎంత ఉందో… రాము పాత్ర కూడా అంతే ఉంది అన్నాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు రాము ఆదుకున్నాడని, అన్నం పెట్టాడని హైపర్ ఆది చెప్పి ఎమోషనల్ అయ్యాడు. హైపర్ ఆది ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మన ఎదుగుదలకు తోడ్పడిన వారిని గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం. హైపర్ ఆది ఎంత ఎదిగినా తన మూలాలు మర్చిపోకుండా రాము సహాయం చేశాడని అందరి ముందు ఓపెన్ అయ్యాడు. రాము జబర్దస్త్ కమెడియన్ గా అక్కడే ఉండిపోయాడు. హైపర్ ఆది మాత్రం సినిమాల్లో కూడా రాణిస్తున్నాడు. హైపర్ ఆది సంపాదన నెలకు లక్షల్లో ఉంది. హైపర్ ఆది కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ గా కూడా పని చేస్తున్నాడు. ఆయన రేంజ్ మారిపోయింది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలకు హైపర్ ఆది ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాడు.