
Hyderabad Old City: ఓల్ సిటీ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్, ఎంఐఎం పార్టీ. ముస్లిం సామాజికవర్గం అధికంగా ఉండే ఈ ఓల్డ్ సిటీ పరిధిలోకి వచ్చే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. అక్కడ పోటీ చేసేందుకు కూడా కొన్ని పార్టీలు అభ్యర్థులను నిలపడం లేదు. నిలిపినా గెలవడం లేదు. దీంతో పాతబస్తీ ఎంఐఎం అడ్డాగా మారింది. నాయానో భయానో అక్కడి ఓటర్లు కూడా ఎంఐఎం అభ్యర్థులనే గెలిపిస్తూ వస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. పాతబస్తీ అక్రమ దందాలకు అడ్డాగా మారుతోందని ఎప్పుటి నుంచో ఉన్న ఆరోపణ. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అండగా ఉంటున్నారని అందరికీ తెలిసిన నిజం. దశాబ్దాలుగా గెలుస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్రమాలకు కొమ్ము కాయడం, అడ్డుచెప్పేవారిపై మతం ముసుగులో దాడులు చేయించడం మినహా ప్రాంత అభివృద్ధిపై ఆలోచన చేయరు. అభివృద్ధి చెందితే అక్రమ దందాలు ఆగిపోతాయని వారికి తెలుసు. అదే జరిగితే మరోవైపు ఎంఐఎంకు భవిష్యత్తు ఉండదని ప్రచారం. అందుకే ఓల్డ్ సిటీ అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యేలే అడ్డుకుంటున్నారనేది నిజం. పాలకులు కూడా ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తున్నారు.
స్వంతత్ర రాజ్యాంలా..
తెలంగాణలో విద్యుత్ బకాయిలు అత్యధికంగా ఉన్న మొదటి ప్రాంతం పాతబస్తీ. రెండో స్థానంలో సిద్దిపేట ఉన్నాయి. ఇవి స్వయంగా విద్యుత్‌శాఖ వెల్లడించిన వివరాలే. పాత బస్తీలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి కూడా అధికారులు ప్రయత్నం చేయకపోవడం అక్కడి అరాచకానికి నిదర్శనం. హైదరాబాద్‌లో ఉన్నా.. తమకు ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలు వర్తించవన్నట్లుగా పాతబస్తీవాసులు ప్రవర్తిస్తున్నారు. అందుకే ఇష్టానుసారం విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ట్రాఫిక్ చలానాలు కూడా ఇక్కడ విధించరు. ఇంటి పన్ను, నల్లా పన్ను, ఇతర జీహెచ్‌ఎంసీ ట్యాక్స్‌లు వసూలు చేయరు. ఏ దందా చేస్తున్నా అడ్డు చెప్పరు. వారికి అనుమతి కూడా అవసరం లేదు. అదే సమయంలో కరెంటు దొంగలకు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కొమ్ముకాయడం గమనార్హం. పాతబస్తీని స్వతంత్ర రాజ్యంలా వ్యవహరిస్తున్నారు.
వేలకోట్ల విద్యుత్ బకాయిలు..
విద్యుత్ సంస్థలు విడుదల చేసిన లెక్కల ప్రకారమే హైదరాబాద్ సౌత్‌జోన్ పరిధిలోకి వచ్చే పాతబస్తీలోని అస్మానఘర్, చార్మినార్, బేగంబజార్ ప్రాంతాలో విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. ఈ ప్రాంత పరధిలోనే రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్లు డిస్కంలు, విద్యుత్ సంస్థలు నివేదిక విడుదల చేశాయి. అస్మాన్ ఘర్ ఏరియాలో 39 శాతం, బేగంబజార్ ఏరియాలో 35 శాతం, చార్మినార్ ఏరియాలో 38 శాతం విద్యుత్ చోరీ జరుగుతుంది. సరాసరిగా వందకు 37 శాతం విద్యుత్ చోరీ అవుతోంది. దీని విలువ ఏడాదికి రూ.700 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. తెలంగాణ ఏర్పడిన తర్వాత గడిచిన ఎనిమిదిన్నర ఏళ్లలో రూ.6,500 కోట్ల విద్యుత్ చోరీ అయింది.

అక్బర్ సవాల్ స్వీకరిస్తారా..
తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో వివిధ చార్జీల పేరుతో ముక్కుపిండి విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్న అధికారులు, ఒకనెల బకాయి ఉన్నా కనెక్షన్ కట్‌చేస్తారు. పాతబస్తీలో ఏళ్ల తరబడి విద్యుత్ చౌర్యం జరుగుతున్నా, వేల కోట్ల విద్యుత్ వృథా అవుతున్నా అటువైపు కన్నెత్తి చూసే నాథుడే లేడు. అయినా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాతబస్తీ వాసులను బద్నాం చేస్తున్నారని అసెంబ్లీ వేదికగా పేర్కొనడం గమనార్హం. అధికారిక లెక్కలు ఉన్నా, పాత బస్తీలో విద్యుత్ చౌర్యం జరుగడం లేదని దబాయిండం ఆయనకే చెల్లింది. అంతేకాదు బకాయిలు ఉంటే నిరూపించాలని, బకాయి ఉంటే తానే కడతానని ప్రభుత్వానికి సవాల్ చేయడం కొసమెరుపు.
నోరు మొదపని విద్యుత్ మంత్రి..
పాత బస్తీలో వేల కోట్ల విద్యుత్ చౌర్యం జరుగుతున్నా.. విద్యుత్ సంస్థలు అధికారిక లెక్కలు విడుదల చేసినా ఎంఐంఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన సవాల్‌పై విద్యుత్ శాఖ మంత్రి జగీశ్‌రెడ్డి కనీసం నోరు కూడా మెదపలేదు. ఇక అసెంబ్లీలో అన్నీతానై వ్యవహరిస్తున్న ముఖ్యమైన మంత్రి కేటీఆర్ కూడా దీనిపై స్పందించలేదు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని పదేపదే చెబుతున్న కల్వకుట్ల తారకరామారావుకు ఓల్డ్ సిటీలో జరుగుతున్న అక్రమాలపై స్పందించేందుకు భయపడడం ఓటు బ్యాంకు రాజకీయం కాక ఇంకేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరి అసెంబ్లీలో బకాయిలు ఉంటే చెప్పండి తానే కడతానని సవాల్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అబ్బరుద్దీన్ గడిచిన ఎనిమిదేళ్లకు సబంధించి విద్యుత్ సంస్థలు విడుదల చేసిన బకాయిలు రూ.6,500 కోట్లు కట్టే దమ్ముందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పాతబస్తీవాసులు కట్టని భారం మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇతర ప్రాంత ప్రజలపై మోపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.