ప్రియుడి మీద పెంచుకుంది. భర్తను నిర్లక్ష్యం చేసింది. పెళ్లినాటి ప్రమాణాలు వదిలేసింది. భర్తకు బ్రెడ్ జామ్ ఇచ్చి ప్రియుడికి మాత్రం పాలకోవ, రసగుల్లా, జామున్ ఇచ్చేంతగా తెగించింది. కొంత కాలం గుట్టు చప్పుడు కాకుండా సాగిన అక్రమ సంబంధం వ్యవహారం చివరికి మొగుడికి తెలిసింది. దీంతో ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా మర్పు రాకపోవడంతో ఎలాగైనా బుద్ది చెప్పాలని భావించాడు. కత్తి తీసుకుని ముక్కు, చెవులు కోసి తన భార్యను విడిచిపెట్టకపోతే ఇక అంతే అని బెదిరించాడు.
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలోని ముజఫర్ నగర్ లో అబ్దుల్ ఖయ్యూమ్, రజియా బేగం (పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లపాటు వారి బంధం సజావుగానే కొనసాగింది. అయితే వారి సంసారంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. భర్తతో సంతోషంగా ఉంటున్న రజియా బేగం కథ మరో కోణంలోకి మారిపోయింది. భర్తలో కోపం కట్టలు తెంచుకుని పద్దతి మార్చుకోవాలని సూచించాడు. అయినా రజియా పెడచెవిన పెట్టింది. దీంతో అబ్దుల్ ఎలాగైనా ప్రియుడు మహ్మద్ అక్రమ్ ను అంతమొందించాలని పథకం పన్నాడు.
రజియా బేగం ప్రవర్తనలో మార్పు రాకపోగా ఇంకా రెచ్చిపోయి అక్రమ్ తో విచ్చలవిడిగా గడిపింది. భర్తను రానురాను నిర్లక్ష్యం చేసింది. ప్రియుడితో జల్సా చేస్తూ కోరికలు తీర్చుకుంది. ఈ నేపథ్యంలో తన భార్యను వదిలేయాలని అబ్దుల్ అక్రమ్ కు సూచించినా ఫలితం లేకపోయింది. దీంతో అతడికి బుద్ది చెప్పాలనే నిర్ణయించుకున్నాడు. అక్రమ్ చివరికి అబ్దుల్ చేతికి చిక్కాడు. దీంతో అతడి ముక్కు, చెవులు కోసి రోడ్డుపై పడేశాడు. అక్రమ్ అరుచుకుంటూ ఆస్పత్రికి పరుగులు పెట్టాడు.
అక్రమ సంబంధం కారణంగానే చప్పిన మాట వినకపోవడంతోనే ప్రియుడు ముక్కు, చెవులు కోయడం పాకిస్తాన్ లో సంచలనంగా మారింది. అక్రమ్ ముక్కు, చెవులు కోస్తున్న సమయంలో ఆ దృశ్యాలన్ని సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. అచ్చం రామాయణంలో లాగా ముక్కు, చెవులు కోయడం హాట్ టాపిక్ గా అయిపోయింది.