Husband And Wife Relationship: పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండాలి అని అందరూ ఆశిస్తారు. కాలం గడిచే కొద్దీ కొంతమంది మధ్య చిరాకులు, తగాదాలు సహజమైపోతాయి. సంసారం సజావుగా సాగాలి అంటే కేవలం అన్యోన్యత మాత్రమే సరిపోదు ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం, కలిసి ఒడిదుడుకులను ఎదుర్కొని స్వభావం ఉండాలి. మీ సంసారం సజావుగా సాగాలి అంటే కచ్చితంగా మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.
ముఖ్యంగా పెళ్లి అనేది మగవాడికి ఒక ఆసరా అందిస్తే ఆడదానికి రక్షణ , భద్రతను ఏర్పాటు చేస్తుంది. పెళ్లి అనగానే ఒకరిపై ఒకరికి ఎక్కడలేని ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి. ఇది సహజం కూడా. కానీ హద్దులు మీరిన ఎక్స్పెక్టేషన్స్ మొదట్లో బాగానే ఉంటాయి కానీ సమయం గడిచే కొద్దీ సంసారంలో లేనిపోని ఇబ్బందులను తెచ్చి పెడతాయి.
తమ జీవిత భాగస్వామి చేయలేని వాటిని కచ్చితంగా చేయాలని ఆశపడితే సంసారంలో సమస్యలు రావడం సహజం. భర్త కోసం భార్య ..భార్య కోసం భర్త ,పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు .కానీ బంధాన్ని నిలబెట్టుకునే విధంగా బాధ్యతగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎవరు ఉండరు అనే విషయం అందరికీ తెలిసిందే కానీ మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి ఒక హద్దు ఉంటే మంచిది.
అవతల వారి నుంచి అతిగా ఆశించే ముందు మనం వాళ్ళకి వాళ్ళు ఇష్టపడినది అందేవ్వగలమా అని ఆలోచించుకుంటే అసలు ఏ సమస్య రాదు. పొరుగింటి పుల్ల కూర రుచిగా ఉంటుంది అన్నట్టు చాలామంది ఆడవాళ్లకు తమ సంసారం కంటే పక్కన వాళ్ళ సంసారమే హాయిగా కనిపిస్తుంది. ఎప్పుడు వారితో పోటీ పడుతూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల అవతల వాళ్ళ సంసారం సంగతి దేవుడెరుగు…మీ సంసారంలో మీరే నిప్పులు పోసుకున్న వారవుతారు.
ఒకరినొకరు అర్థం చేసుకుని తోడుగా ఉంటే అంతకంటే ఆనందమైన సంసారం ఇంకొకటి ఉండదు. మనకు నచ్చినట్లు అవతల వాళ్ళు ఉండాలి అని ఎలా ఆశిస్తామో మనం కూడా వాళ్లకు నచ్చినట్టు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఏ సంసారంలో గొడవలు ఉంటాయి. సర్దుకుపోవడం సంసారాన్ని బలహీనపరచదు బలంగా మారుస్తుంది. అలాగని కేవలం ఆడవాళ్లే సర్దుకుపోవాలి అనుకోకూడదు మగవాళ్ళు కూడా అప్పుడప్పుడు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి.