Hyderabad History: భారతదేశానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అందులోనూ హైదరాబాద్ సంస్థానానికి స్పెషల్ హిస్టరీ ఉంది. హైదరాబాద్ రాజ్యం చుట్టూ భారతదేశం ఉన్నా.. ఇక్క నిజాం నవాబులు ప్రత్యేకంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భారత్ తో సంబంధం లేకుండా దేశాన్ని కొనసాగించారు. ఆ తరువాత జరిగిన పరిణామాల క్రమంలో హైదరాబాద్ భారత్ లో కలిసిపోయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉండిపోయింది.
స్వాతంత్ర్యం రాకముందు హైదరాబాద్ రాజ్యంలో కూడు, గుడ్డ కోసం ఎన్నో పోరాటాలు సాగాయి. కానీ హైదరాబాద్ నగరం మాత్రం వైభంగా కొనసాగింది. అప్పటి నిజాం రాజులు సాగించిన జీవనం ఖరీదైనదిగా ఉన్నదని కొన్ని పుస్తకాల ద్వారా తెలుస్తోంది. అయితే అప్పటి విషయాలకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ రాజ్యంలో నిజాం నవాబుల పాలన 400 ఏళ్లకు పైగా సాగింది. మొదట ఇక్కడ చించలం అనే పేరుతో ఉండే చిన్న గ్రామం ఉండేది. 1590లో కలరా వచ్చి గోల్కోండ నగరం మొత్తం దు:ఖంలో మునిగిపోయింది. దీంతో కులీ కుతుబ్ షా ఇక్కడికి వచ్చి కొన్నాళ్లు బస చేశాడు. ఆ తరువాత కలరా తగ్గిన తరువాత తనకు గుర్తుగా 1591లో ఛార్మినార్ ను నిర్మించాడు. 1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట హైదరాబాద్ నిర్మాణం చేసుకుంది.
ఆ తరువాత కాలంలో హైదరాబాద్ ఆ కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందింది. భారత్ లో ఇతర చోట్ల ఉనికి కోసం పోరాటాలు సాగుతున్న వేళ హైదరాబాద్ లో మాత్రం సకల సౌకర్యాలతో నవాబులు ఆనందంగా జీవించారు. నైనాం కాలంలోనే ఇక్కడ నిజాం కళాశాల, హైకోర్టు, ఉస్మానియా విశ్వ విద్యాలయం, విమానాశ్రయం వంటివి ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క పార్లమెంట్ భవనం తప్ప ఒక దేశానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండేది.
అందుకే భారత రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ ఏడాదికి ఒక్కసారైనా హైదరాబాద్ లో పార్లమెట్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు బొల్లారంలో రాష్ట్రపతి భవన్ ను కూడా నిర్మించారు. ఇక 1956లోనే హైదరాబాద్ దేశంలో అతిపెద్ద 5వ నగరంగా ఉండేది. ఆ తరువాత భాషల వారీగా రాష్ట్రాలు పునర్వవ్యస్థీకరణ జరుపుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ తరువాత హైదరాబాద్ రాజధానిగా అవతరించింది. ప్రస్తుతం తెలంగాణకు రాజధానిగి హైదరాబాద్ కొనసాగుతోంది.